గ్రీన్ ఛాలెంజ్‌లో పాల్గొన్న టీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యదర్శి..

137
Taduri Srinivas

పర్యావరణ పరిరక్షణ, హరిత తెలంగాణే లక్ష్యంగా రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ మదిలో పురుడు పోసుకొని దేశవ్యాప్తంగా విశిష్ట కీర్తిని గడించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమంలో భాగంగా టీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యదర్శి తాడూరి శ్రీనివాస్ తన పొరుగు నివాసి సహన్ సంతోష్ పుట్టిన రోజును పురస్కరించుకొని ఒక మొక్కను నాటించి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ యొక్క ప్రాశస్త్యాన్ని అక్కడి కాలనీ వాసులకు వివరించారు. ప్రతి ఒక్కరు ఒక మొక్కని నాటాలని విజ్ఞప్తి చేశారు.