రేవంత్ రెడ్డి ఇచ్చిన 50 లక్షల విరాళం చెల్లదు..

403
Krishank
- Advertisement -

కాంగ్రెస్‌ ఎంపీ రేవంత్ రెడ్డి తెలంగాణ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (TIMS)కు ఇచ్చిన 50లక్షల విరాళం చెల్లదు. కేవలం పబ్లిసిటీ కోసమే ! అని టీఆర్ఎస్ నాయకులు క్రిశాంక్ అన్నారు. ఎంపీ నిధులు ఒక నియోజకవర్గం నుండి మరో నియోజకవర్గానికి దానం చేయాలనుకుంటే ఒక సంవత్సరంలో కేవలం 25 లక్షలు మాత్రమే చేయడానికి ఎంపీ లాండ్స్‌ నిభందనల్లో ఉన్నాయన్నారు.

రేవంత్‌ రెడ్డి చేవేళ్ల పార్లమెంట్‌ నియోజకవర్గంలో ఉన్న తెలంగాణ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కోసం 50 లక్షల అనౌన్స్‌మెంట్‌ చెల్లదు.. ఇది సాధ్యం కాదు.. ఇది ఎంపీ లాండ్స్‌ నిబంధనలకు వ్యతిరేకంగా ఉన్నదని క్రిశాంక్‌ తెలిపారు. ఇది కేవలం మీడియా పబ్లిసిటీ స్టంట్ మాత్రమే అని మీడియాలో పోటోలు.. వార్తలు రావడం కోసమే అని ఎద్దేవ చేశారు. ఇక రేవంత్‌ రెడ్డి లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఇప్పటివరకు తన నియోజకవర్గం మల్కాజిగిరిలో ఏనాడు ప్రజలకు దాన ధర్మాలు చేయలేదు.. కనీసం ప్రజలను పట్టించుకోలేదని టీఆర్‌ఎస్‌ నాయకులు క్రిశాంక్‌ పేర్కొన్నారు.

- Advertisement -