సంతన్న సహకారంతో ఇంటింటికీ భోజనం..

390
free food in borabanda
- Advertisement -

లాక్ డౌన్ కారణంగా పేద ప్రజలు ఎవరు కూడా ఆకలితో అలమటించ కూడదన్న ముఖ్యమంత్రి కెసిఆర్ సూచన మేరకు రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ సహకారంతో బోరబండలో జీహెచ్‌ఎంసీ డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్ ఆద్వర్యంలో ప్రతి రోజూ పేద కుటుంబాలకు, వలస కూలీలకు ఇంటింటికీ వెళ్లి భోజనం ప్యాకెట్లను అందజేయడం జరుగుతుంది.

free food

ఈసందర్భంగా బాబా ఫసియుద్దీన్ మాట్లాడుతూ.. రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ అడిగిన వెంటనే పెద్ద మనసుతో లాక్ డౌన్ మొదలైనప్పటి నుండి ఈ రోజు వరకు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సంస్థ తరఫున ప్రతి రోజూ భోజనం ప్యాకెట్లు ఏర్పాటు చేయించడం చాలా గొప్ప విషయం అని. ఈ సందర్భంగా రాజ్యసభ సభ్యులు సంతోష్ కి బొరబండ ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలిపారు.

- Advertisement -