వారిపై పరువునష్టం దావా వేస్తా-జూపల్లి

299
jupally

నాగర్ కర్నూలు జిల్లా, కొల్లాపూర్ టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయంలో జూపల్లి కృష్ణారావు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పార్టీ మారుతున్నట్లు సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై స్పందించారు.. పార్టీ మారుతున్నానంటూ వస్తున్న వార్తలతో నేను చాలా బాధ పడుతున్నాను. ఇలాంటి తప్పుడు ప్రచారం ఎవరు చేస్తున్నారో వారిని ఉరికే వదిలేదిలేదు. వారిపై కోటి రూపాయలకు పరువునష్టం దావా వేస్తున్నా అని జూపల్లి మండిపడ్డారు.

నేను గతంలోనే స్పష్టం చేశాను. రాజకీయాల్లో20 సంవత్సరాలు పార్టీ మారకుండా.. ప్రజల పక్షం వహించాను. అధికారం ఉండి పదవి ఉండి వదిలేశాను. నా పని నేను చేస్తూ టీఆర్‌ఎస్‌ పార్టీలో పని చేస్తున్నాను. మాకు నైతిక విలువలు ఉన్నాయి. నేను ఏనాడూ పదవులకు అమ్ముడుపోలేదు. ఇంక ఉన్న పదవులు వదులుకున్నానని ఆయన తెలిపారు.

కొందరు ఖర్చు లేకుండా అవాస్తవాలు వాస్తవాలని చేసి.. మా ప్రతిష్టకు భంగం కలిగించాలని సోషల్ మీడియా ద్వారా వ్యాప్తి చేస్తున్నారు. ఇలాంటి తప్పుడు ప్రచారాలు మానుకోవాలి.ఎవరైనా అబద్ధపు ప్రచారాలు చేస్తే వెంటాడుతాం. మితిమీరి ప్రవర్తిస్తే తగిన బుద్ధి చెపుతామని జూపల్లి హెచ్చరించారు.