గ్రీన్ ఛాలెంజ్‌లో పాల్గొన్న జోగినిపల్లి రవీందర్ రావు..

119
Joginipally Ravinder Rao
- Advertisement -

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా టీఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర సీనియర్ నాయకులు జోగినిపల్లి రవీందర్ రావు సోమవారం తన 65వ పుట్టినరోజు పురస్కరించుకుని కొదురుపాకలో 65 మొక్కలు నాటారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొని మొక్కలు నాటడం ఆనందంగా ఉందని అన్నారు. గ్లోబల్ వార్మింగ్ ని అరికట్టాలన్న పర్యావరణ పరిరక్షణకై ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని కోరారు.

ప్రకృతికి మేలు కలిగేలా ఇంత మంచి కార్యక్రమం చేపట్టిన ఎంపీ సంతోష్ కుమార్‌కి రవీందర్ రావు కృతజ్ఞతలు తెలియజేశారు. పర్యావరణాన్ని పరిరక్షించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక టీఆర్‌ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

- Advertisement -