టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి పై తీవ్ర స్ధాయిలో మండిపడ్డారు గుత్తా సుఖేందర్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ తరపున నల్లగొండ ఎంపీగా పోటీ చేస్తున్న టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఓడిపోవడం ఖాయం అన్నారు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్ధి గుత్తా సుఖేందర్ రెడ్డి. తనపై నమ్మకంగా ఉంచి ఎమ్మెల్సీగా అవకాశం కల్పించిన సీఎం కేసీఆర్ కు రుణపడి ఉంటానన్నారు. ఈసందర్బంగా ఆయన నల్గొండలో మీడియాతో మాట్లాడారు. సొంత పార్టీ ఎమ్మెల్యేలనే కాపాడుకోలేని ఉత్తమ్ ఎంపీగా గెలుస్తానని గొప్పలు చెబుకుంటున్నారని ఆరోపించారు. టీఆరోస్ తరపున నల్గొండ ఎంపీగా పోటీ చేస్తున్న వేంరెడ్డి నర్సింహారెడ్డి భారీ మెజార్టీతో గెలిపించి సీఎం కు కానుకగా ఇస్తామన్నారు.
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధులందరూ గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలయినవారే అని గుర్తు చేశారు. కోదాడ, హుజుర్ నగర్ నియోజకవర్గాల్లో తప్పితే..రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల్లో ఉత్తమ్ ను ఎవరూ గుర్తుపట్టరని చెప్పారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి వల్లే కాంగ్రెస్ పార్టీ నాశనం అవుతుందన్నారు. నల్గొండ టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్ధి వేమిరెడ్డి నరసింహారెడ్డి ఈ నెల 25న నామినేషన్ దాఖలు చేస్తారని తెలిపారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల తీర్పే ప్రజలు మళ్లీ ఇస్తారన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. రైతు సమన్వయ సమితి ఛైర్మన్‌గా రైతులకు సేవ చేసే భాగ్యాన్ని సీఎం కల్పించారు. ఇప్పుడు ఎమ్మెల్సీగా ప్రకటించినందుకు ఆయన సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో నల్లగొండ జిల్లాను అభివృద్ది చెందుతుందన్నారు.