రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా తన జన్మదిన సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి మొక్కలు నాటారు టీఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర యువ నాయకులు, వేదం ఫౌండేషన్ చైర్మన్ అలిశెట్టి అరవింద్ కుమార్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్పూర్తితో ఈ రోజు మొక్కలు నాటాను అని అన్నారు.
ప్రస్తుత పరిస్థితుల్లో ఆక్సిజన్ అందక ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. భవిష్యత్‌లో ఇలాంటి రాకుండా ఉండాలంటే అందరూ బాధ్యతతో మొక్కలు నాటాలి. అంతేకాదు అవి పెరిగే బాధ్యత కూడా మనమే తీసుకోవాలి. ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ గత 4 సంవత్సరాల నుండి గ్రీన్ ఇండియా చల్లేంజ్ ద్వారా చిన్న పెద్ద ధనిక పేద అని తేడా లేకుండా అందరిలో స్ఫూర్తి నింపి అందరితో మొక్కలు నటిస్తున్నారు. మానవాళికి మొక్కలు ఎంతో అవసరం. రానున్న రోజుల్లో మొక్కలు లేకుంటే మనిషి మనుగడ కూడా కష్టమే అన్నారు.