ట్విట్టర్ వేదికగా ప్రధానమంత్రి నరేంద్రమోడీ,రాహుల్ గాంధీలపై మండిపడ్డారు మంత్రి కేటీఆర్. ఎన్నికల ప్రచారంలో మోడీ,రాహుల్ అబద్దాలే చెబుతున్నారని చెప్పారు. కాంగ్రెస్‌కు టీఆర్ఎస్ బీ టీమ్ అని నరేంద్ర మోడీ అంటున్నారు. బీజేపీకి టీఆర్ఎస్….బీ టీమ్ అని రాహుల్ గాంధీ అంటున్నారు. కానీ ఈ ఇద్దరు వ్యక్తులు డిసెంబర్ 11న టీ ఆర్ ఎస్ తెలంగాణ ప్రజల ఏ టీమ్ అని గుర్తిస్తారని చురకలంటించారు.
మన బీడు భూములకు నీళ్లు రావాలన్నా, ప్రాజెక్టులు పూర్తి కావాలన్నా, TRS మళ్లీ గెలవారి, కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని ట్వీట్టర్ లో కేటీఆర్ చేస్తున్న ప్రచారానికి మంచి రెస్పాన్స్ వస్తోంది. నెటిజన్లు అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం ఇస్తూ ప్రత్యర్థులపై మాటల తూటాలు వదులుతున్నారు కేటీఆర్.
In Telangana election campaign @narendramodi Ji labels TRS as B-team of Congress!!
And @RahulGandhi Ji calls TRS, the B-team of BJP!!!
Both of you gentlemen will realise on 11th December that we are A-team of people of Telangana 👍
— KTR (@KTRTRS) December 4, 2018