టీఆర్‌ఎస్‌ బీఆర్‌ఎస్‌ గా మార్పు.. పార్లమెంట్‌లో స్పందన

36
- Advertisement -

దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పుకోసం సీఎం కేసీఆర్ నాయకత్వంలో క్రియాశీలక పాత్ర పోషించబోతున్న బీఆర్‌ఎస్‌ పార్టీకి దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున మద్దతు లభిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలువురు జాతీయ నేతలు సీఎం కేసీఆర్‌ ను కలిసి తమ మద్దతు ఇచ్చారు.

ఇక జాతీయ స్థాయిలో రాజకీయ పార్టీగా ఆవిర్భవించిన బీఆర్‌ఎస్ పార్టీకి సంబంధించిన ఎంపీలు పార్లమెంట్‌ ఉభయ సభల్లో.. టీఆర్ఎస్‌ పేరును బీఆర్‌ఎస్‌ గా మార్చాలంటూ లోక్‌ సభ స్పీకర్‌ ఓంబిర్లా, రాజ్యసభ చైర్మన్ జగదీప్‌ ధన్ఖడ్‌ లను విజ్ఞప్తి చేశారు. పార్లమెంట్‌ ఉభయ సభల్లో టీఆర్ఎస్‌ పేరును బీఆర్‌ఎస్‌ గా మార్చాలని బీఆర్‌ఎస్‌ పార్టీ లోక్‌ సభ ప్లోర్‌ లీడర్‌ నామా నాగేశ్వర్‌ రావు, రాజ్యసభ ప్లోర్‌ లీడర్‌ కే. కేశవరావుతో పాటు ఇతర బీఆర్ఎస్‌ పార్టీ ఎంపీలు లేఖను అందజేశారు.

రాజ్యసభలో బీఆర్ఎస్‌ పార్టీ పేరు మార్పుకై చైర్మన్‌ జ‌గ‌దీప్ ద‌న్ఖ‌డ్ వెంటనే స్పందించారు. ఇకపై పార్టీపేరును బీఆర్ఎస్‌ గా మార్చాలని అధికారులను చైర్మన్ జ‌గ‌దీప్ ద‌న్ఖ‌డ్ ఆదేశించారు. తెరాస ఎంపీల విజ్ఞప్తి పై లోకసభ స్పీకర్ ఓం బిర్లా కూడా సానుకూలంగా స్పందించారు. పార్టీ పేరు మార్పును పరిశీలించి నిర్ణయం తీసుకుంటాన‌ని స్పీకర్ ఎంపీలకు తెలిపారు. ఇప్పటికే తెలంగాణ శాసన మండలిలో టీఆర్ఎస్‌ పార్టీ పేరు బీఆర్‌ఎస్‌ గా మారగా… తాజాగా లోక్‌ సభ, రాజ్యసభలోనూ టీఆర్ఎస్‌ పార్టీ పేరు బీఆర్‌ఎస్‌ గా మారనుంది.

- Advertisement -