తెలంగాణలో ఎన్నికల హాడావిడి మొదలైంది. ఎన్నికలకు ఇంకా నెలల సమయం ఉండగానే అధికార, ప్రతిపక్ష పార్టీలు మాటల యుద్దంతో కాక పుట్టిస్తున్నాయి. ముఖ్యంగా అధికార, ప్రతిపక్షాల పరస్పర విమర్శలతో రాజకీయ వాతావరణం పూర్తిగా మారిపోయింది.
ఇక అధికార టీఆర్ఎస్ ఈసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని ఉవ్విళ్లూరుతుండగా కాంగ్రెస్, బీజేపీలు సైతం విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి. ఇక ప్రధానంగా టీఆర్ఎస్ రెండు జాతీయ పార్టీలకు చెక్ పెట్టేందుకు కొత్త స్కెచ్ వేస్తోంది.
బలమైన నేతలకు కారెక్కించుకునేందుకు గులాబీ పార్టీ వ్యూహరచన చేస్తోంది. క్షేత్ర స్థాయిలో సత్తా ఉన్న నేతలపై ఆపరేషన్ ఆకర్ష్ షురూ చేస్తోంది. గ్రామ, మండల స్థాయి నేతలను టార్గెట్ చేస్తోంది. ఓట్లు సాధించే నేతలను బుట్టలో వేసుకుంటే కాంగ్రెస్, బీజేపీలను బలహీనం చేయొచ్చని భావిస్తోంది. సైలెంట్‌గా తమ ప్లాన్‌ను ఇంప్లిమెంట్ చేసేలా కసరత్తు చేస్తున్నారు టీఆర్ఎస్ నేతలు.

