యుఎస్‌లో ఎన్టీఆర్… ‘ఆది’ స్పెషల్‌ షో!

132
aadi
- Advertisement -

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా వివి వినాయక్ దర్శకత్వం వహించిన సినిమా ఆది. శ్రీ లక్ష్మీనరసింహ ప్రొడక్షన్స్ బ్యానర్ పై నల్లమలుపు శ్రీనివాస్ నిర్మాతగా తెరకెక్కిన ఈ భారీ మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ 2002లో ప్రేక్షకుల ముందుకువచ్చింది. ఎన్టీఆర్ కెరీర్‌లో బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచిన చిత్రాల్లో ఈ సినిమా ఒకటి కాగా ఈ సినిమాతో మాస్‌లో మంచి క్రేజ్ సంపాదించారు.

ఇక ఈ సినిమా విడుదలై 20 ఏళ్ళు గడుస్తున్న సందర్భంగా అమెరికాలో స్పెషల్ షోని ప్రదర్శించనున్నారు. మే 20న ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా డల్లాస్‌లో ఈ స్పెషల్ షోని వేయనున్నారు.

నూనూగు మీసాల వయసులోనే ఇండస్ట్రీ రికార్డులతో చెడుగుడు ఆడుకున్నాడు జూనియర్ ఎన్టీఆర్. ముఖ్యంగా ఆది 106 కేంద్రాల్లో 50 రోజులు.. 96 కేంద్రాల్లో 100 రోజులు.. 3 కేంద్రాల్లో డైరెక్టుగా 175 రోజులు ఆడేసింది. దాదాపు 18 కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది. మణిశర్మ పాటలు,పరుచూరి బ్రదర్స్ డైలాగ్స్,జూనియర్ ఎన్టీఆర్ డైలాగ్ డెలవరీ,ఫ్యాక్షనిజం బ్యాక్ డ్రాప్ అన్నీ సినిమా విజయానికి కలిసొచ్చాయి.

- Advertisement -