టీఆర్ఎస్ పార్టీ ఫండ్‌@ 42.8 కోట్లు

236
TRS has 42.08 cores said KCR
- Advertisement -

టీఆర్ఎస్ 17వ ప్లీనరీ సందర్భంగా సీఎం కేసీఆర్ పార్టీ ఫండ్ ప్రకటించారు. ఇప్పటివరకు పార్టీ ఫండ్‌ రూ. 21 కోట్ల 67 లక్షలు ఉందని ప్లీనరీ సందర్భంగా పార్టీ నేతలు పెద్ద ఎత్తున విరాళాలిచ్చారని వారందరికి ధన్యవాదాలు తెలిపారు. పార్టీ నేతలు ఇవాళ రూ. 20 కోట్ల 41 లక్షల విరాళాలు ఇచ్చారు. మొత్తం కలిపి రూ. 42 కోట్ల 8 లక్షల రూపాయలు అని వివరాలన్నింటినీ .. ఇన్‌కమ్ ట్యాక్స్, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు సమర్పిస్తామని తెలిపారు. ప్లీనరీ సందర్భంగా ఎవరి నుంచి విరాళాలు సేకరించలేదని పార్టీ నేతల సహకారంతో ప్లీనరీ జరుగుతోందన్నారు. అక్టోబర్‌ చివరి వారం లేదా నవంబర్‌ మొదటివారంలో భారీ బహిరంగసభను నిర్వహిస్తాని…ఈ సభకు జాతీయ నేతలను ఆహ్వానిస్తామని చెప్పారు. బహిరంగసభ సందర్భంగా విరాళాలు ఇవ్వాలని ప్రజలను కోరుతామని చెప్పారు.

విరాళాలు ఇచ్చిన పార్టీ నేతలు….

ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి రూ. 2 కోట్లు
మల్కాజ్‌గిరి ఎంపీ మల్లారెడ్డి రూ. కోటి
టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ సలీం రూ. కోటి
మహబూబ్‌నగర్ ఎంపీ జితేందర్‌రెడ్డి, తనయుడు రవీందర్‌రెడ్డి రూ. 2 కోట్లు
టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ భానుప్రసాద్ రూ. కోటి
టీఆర్‌ఎస్ ఎంపీ కొండా విశేశ్వర్‌రెడ్డి రూ. కోటి
నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్‌రెడ్డి రూ. కోటి
పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి రూ. 75 లక్షలు,
ఎంపీ బీబీ పాటిల్ రూ. 51 లక్షలు
దండె విఠల్ రూ. 50 లక్షలు
ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి రూ. 50 లక్షలు
ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి రూ. 50 లక్షలు
కొత్త మహేందర్‌రెడ్డి రూ. 50 లక్షలు
ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి రూ. 40 లక్షలు
ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి రూ. 25 లక్షలు
ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి 25 లక్షలు
ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి రూ. 25 లక్షలు
ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి రూ. 25 లక్షలు
రామ్మోహన్‌రావు రూ. 25 లక్షలు
పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి రూ. 25 లక్షలు
గుండు సుధారాణి రూ. 25 లక్షలు
మహేశ్ బిగాల రూ. 25 లక్షలు,
ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి రూ. 25 లక్షలు,
ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి రూ. 25 లక్షలు,
ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ రూ. 25 లక్షలు

- Advertisement -