వికెట్ తీసి… ధావన్‎ని అసభ్యంగా తిట్టాడు…

205
Ankit Rajpoot, Ankit Rajpoot slammed for abusive send-off to Shikhar Dhawan
- Advertisement -

ఐపీఎల్-11లో భాగంగా నిన్న ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్‎లో హైదరాబాద్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఉప్పల్ స్టేడియంలో కింగ్స్ ఎలెవన్ పంజాబ్‎తో తలనడిర సన్‎రైజర్స్ హైదరాబాద్ టాస్ ఓడి బ్యాటింగ్‎కు దిగింది. ఈ నేపథ్యంలో సన్ రైజర్స్ ఆటగాళ్లు బ్యాటింగ్‎కు దిగారు. మొదట బౌలింగ్ వేసిన అంకిత్ రాజ్‎పూత్ నాలుగో బంతికే విలియమ్సన్స్‎ను ఔట్ చేసి కోలుకోలేని దెబ్బ తీశాడు. అనంతరం మూడో ఓవర్‎లో అంకిత్ రాజ్‎పూత్ వేసిన రెండో బంతిని ధావన్ షాట్ ఆడబోయి క్యాచ్ ఔట్ అయ్యాడు

అయితే బడా వికెట్ తీసిన రాజ్‎పూత్ ధావన్‎ని ఉద్దేశిస్తూ అసభ్య పదజాలంతో తిట్టాడు. ఈ సంఘటన టీవీ వీడియోల్లో స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పుడు ఈ వీడియో వైరల్ అయ్యింది. ఈ వీడియో చూసిన ధావన్ అభిమానులు రాజ్‎పూత్‎పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక్కసారి కూడా భారత్ జెర్సీ ధరించని ఓ ఆటగాడు సీనియర్ క్రీడాకారుడిపై అసభ్యంగా మాట్లాడటం ఏంటని క్రికెట్ అభిమానులు హెచ్చరిస్తున్నారు. ఇది క్రిడాస్ఫూర్తిగా విరుదమన్నారు. అద్భుతమైన బౌలింగ్ చేసి, అందరిని ఆకట్టుకుంటున్నావు, ఆటలో సీనియర్లను గౌరవించడం నేర్చుకో అంటూ ఓ అభిమాని ‎ ట్వీట్ చేశాడు.

https://twitter.com/Thesnehashis/status/989559980633112576

- Advertisement -