నామినేటెడ్ బొనాంజా …మైనార్టీలకు పెద్దపీట

226
- Advertisement -

తెలంగాణ ప్రభుత్వం నామినేటెడ్ పదవుల భర్తీ ప్రక్రియలో వేగం పెంచింది. బడ్జెట్ సమావేశాల్లోపు రాష్ట్ర, జిల్లా స్థాయి నామినేటెడ్ పోస్టులన్నీ భర్తీ చేయాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అదేశించారు. ఇవాళ 10 కార్పొరేషన్  ఛైర్మన్లను ప్రకటిస్తు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సమైక్య రాష్ట్రంలో ఎన్నడు లేని విధంగా తొలిసారిగా మైనార్టీలకు పెద్దపీట వేసిన కేసీఆర్ ప్రధాన కార్పొరేషన్ పదవులను వారితోనే భర్తీ చేశారు.

కార్పొరేషన్ల ఛైర్మన్లు

మీర్ ఇనాయత్ అలీ బాఖ్రీ – సెట్విన్
షేక్ బుడాన్ బేగ్ – తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్
సయ్యద్ అబ్దుల్ అలీమ్ – నెడ్ క్యాప్
మహ్మద్ యూసుఫ్ జాహీద్ – తెలంగాణ స్టేట్ ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ బోర్డ్
సయ్యద్ అక్బర్ హుస్సేన్ – తెలంగాణ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్
కొండబాల కోటేశ్వర్ రావు– తెలంగాణ స్టేట్ సీడ్స్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్
విప్లవ్ కుమార్ – తెలంగాణ స్టేట్ అర్బన్ ఫైనాన్స్ ఇన్‌ ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ మెంట్  కార్పొరేషన్ లిమిటెడ్
తాటి వెంకటేశ్వర్లు (ఎమ్మెల్యే) – తెలంగాణ స్టేట్ గిరిజన కో అపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్
బొల్లం సంపత్ కుమార్ గుప్త– తెలంగాణ స్టేట్ హ్యాండిక్రాఫ్ట్స్ కార్పొరేషన్ లిమిటెడ్
గౌండ్ల నాగేందర్ గౌడ్ – తెలంగాణ స్టేట్ ఎడ్యుకేషన్ అండ్ వెల్ఫేర్ ఇన్‌ ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్ మెంట్ కార్పొరేష్ లిమిటెడ్

దీంతో పాటు  జిల్లా స్థాయిలో ఉండే వివిధ నామినేటెడ్ పదవుల జాబితాను కూడా రూపొందించారు. రాష్ట్రంలో ఇప్పటికే మార్కెట్ కమిటీల నియామకం దాదాపు పూర్తికావచ్చింది. అక్కడక్కడా మిగిలిన మార్కెట్ కమిటీలకు ఈ విడత ఛైర్మన్లను నియమించనున్నారు. అనేక చోట్ల ఛైర్మన్ల నియామకం పూర్తయినా మార్కెట్ కమిటీలకు డైరెక్టర్లను పూర్తిగా నియమించలేదు. ఇప్పుడు డైరెక్టర్ల నియామకం పూర్తి చేస్తారు. ఇక జిల్లా, రెవెన్యూ డివిజన్ స్థాయిలో ఉండే ఫుడ్ అడ్వైజరీ బోర్డు సభ్యులు, గ్రంథాలయ సంస్థ జిల్లా ఛైర్మన్లు, పాలకవర్గాలు, దేవాలయ కమిటీలు, నియోజకవర్గాలు, జిల్లాస్థాయి అసైన్‌మెంట్ కమిటీలు తదితర పదవులను కూడా భర్తీ చేయనున్నారు. మార్చి 8వ తేదీ నుంచి ప్రభుత్వం బడ్జెట్ సమావేశాలను నిర్వహించాలనుకుంటున్నది. ఈలోపే నామినేటెడ్ పదవుల భర్తీ ప్రక్రియ పూర్తి కావాలని సీఎం కచ్చితమైన ఆదేశాలిచ్చినట్టు తెలిసింది. ఇక ఎంఐఎంతో పొత్తులో భాగంగా రెండు ఎమ్మెల్సీ స్ధానాలను వారికి కేటాయించింది టీఆర్ఎస్.

- Advertisement -