జ్యోతిక ….. ‘నాచ్చియార్’ ఫస్ట్ లుక్‌

232
Jyothika Naachiaar first look
- Advertisement -

దక్షిణాదిలో నిన్నటితరం హీరోయిన్‌గా వెలుగువెలిగింది జ్యోతిక. నటుడు సూర్యతో వివాహమైన తరువాత సినిమాలకి దూరంగా ఉంటూ వచ్చింది. ఈ మధ్యనే సెకండ్ ఇన్నింగ్స్ ను మొదలెట్టిన ఆమె, తొలి సినిమాతోనే సక్సెస్ ను అందుకుంది. ప్రస్తుతం ‘మొగలిర్ మట్టుమ్’ సినిమా చేస్తోన్న జ్యోతిక, బాల దర్శకత్వంలో మరో సినిమా చేయడానికి రెడీ అవుతోంది.

తాజాగా జ్యోతిక ఇప్పుడు ”నాచియార్” అనే సినిమాతో దూసుకొస్తోంది. సంచలన డైరక్టర్ బాల ఈ సినిమాను రూపొందించాడు.  ఒకవేళ కమర్షియల్ హిట్టు వస్తుందో లేదో తెలియదు కాని.. బాల సినిమాలంటే ఖచ్చితంగా పేరు మాత్రం వచ్చేస్తుంది. ఈ సినిమాకి సంబంధించిన ఫస్టులుక్ ను సూర్య తన పర్సనల్ ట్విట్టర్ ఎకౌంట్ ద్వారా రిలీజ్ చేశాడు. దర్శకుడు బాల మొదటి నుంచి వైవిధ్యభరితమైన కథాంశాలకి ప్రాధాన్యతనిస్తూ వస్తున్నాడు. అందువలన ఈ సినిమాపై అందరిలోను ఆసక్తి నెలకొంది.

గతంలో మనం చాలా తమిళ సినిమాల్లో చూసినట్లు హీరోయిన్ షర్టు వేసుకుని.. కాస్త రఫ్ గా బిహేవీ చేసే లేడీగా.. తమిళ వాసనతో ఫుల్లుగా ఇంప్రెస్ చేయడానికి ప్రయత్నిస్తోంది జ్యోతిక. మరి ఈ ”నాచియర్” సినిమాను తెలుగులోకి ఏ పేరుతో తెస్తారు.. ఎప్పుడు రిలీజ్ చేస్తారు.. వంటి వివరాలు తెలియాల్సి ఉంది.

Jyothika Naachiaar first look

- Advertisement -