వివిధ భారతీయ భాషల్లో టీఆర్ఎస్ పార్టీ వినూత్న ప్రచారం

199
trs
- Advertisement -

వివిధ భాషల్లో కరపత్రాలు, ఎఫ్ ఎం ప్రకటనలు, పోస్టర్లతో సామాజిక మాధ్యమాల ద్వారా టీఆర్ఎస్ విస్తృత ప్రచారం చేస్తోంది. పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీ తమ ఎన్నికల ప్రచారాన్ని విసృతం చేసింది. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, చేపడుతున్న సంక్షేమ పథకాలను ప్రతీ గడపకూ తీసుకెళ్లాలన్న లక్ష్యంతో వివిధ భారతీయ భాషల్లో ఎఫ్ ఎం రేడియోలో ప్రకటలను, కరపత్రాలను, పోస్టర్లను విడుదల చేసింది. అంతేకాదు, సోషల్ మీడియాలో ట్విట్టర్, ఫేస్ బుక్ వంటి మాధ్యమాల ద్వారా వీటిని జనంలోకి మరింతగా తీసుకెళ్తోంది.

దీనితో తెలంగాణాలో ముఖ్యంగా విశ్వనగరమైన హైదరాబాద్ లో ఉంటున్న వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాల మీద ఒక చక్కటి అవగాహన ఏర్పడటానికి ఆస్కారం ఏర్పడింది.తెలంగాణ రాష్ట్రం ముఖ్యంగా హైదరాబాద్ ముందు నుండీ అనేక రాష్ట్ర ప్రజలకు ఆవాసంగా మారింది. భౌగోళికంగా, వాణిజ్యపరంగా, వనరుల పరంగా అనువుగా ఉండటంతో తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర, గుజరాత్, పంజాబ్ మొదలగు రాష్ట్రాల నుండి వచ్చిన ప్రజలు ఇక్కడే స్థిర నివాసం ఏర్పరుచుకొని ఇక్కడి ప్రజలతో మమేకమయ్యారు.

భిన్నత్వంలో ఏకత్వం లాంటి ఈ సంస్కృతిని టీఆర్ఎస్ పార్టీ సమర్థవంతంగా పరిరక్షిస్తూ వస్తోంది. కేసీఆర్ సారథ్యంలోని ఐదేళ్ల టీఆర్ఎస్ ప్రభుత్వ పాలన నేడు దేశానికే ఒక దిక్సూచిగా మారింది. తెలంగాణ అభివృద్ధి పట్ల, ప్రతీ ఒక్కరికీ అవగాహన కలగాలన్న లక్ష్యంతో టీఆర్ఎస్ పార్టీ చేస్తున్న ఈ వినూత్న ప్రచారాన్ని ఇటీవల 2018 శాసనసభ ఎన్నికల్లోనూ, 2016 ఎన్నికలలోనూ చేసింది..టీఆర్ఎస్ చేపడుతున్న కార్యక్రమాలను, సాధిస్తున్న ప్రగతిని తమ మాతృబాషల్లో వివరించడం వల్ల, తెలంగాణ రాష్ట్రంతో వారికున్న అనుబంధం మరింత పెరగడానికి దోహదపడుతోందని ప్రజలు సైతం తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -