- Advertisement -
రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా తన పుట్టినరోజు సందర్భంగా టీఆర్‌ఎస్ పార్టీ సోషల్ మీడియా కన్వీనర్ దినేష్ చౌదరి ఈరోజు జూబ్లీహిల్స్ జిఎచెంసి పార్క్‌లో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా దినేష్ చౌదరి మాట్లాడుతూ.. ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొని మొక్కలు నాటడం ద్వారా పర్యావరణ పరిరక్షణకు నా వంతు కృషి చేశాను.
సినీ రంగ ప్రముఖులు వివిద రాజకీయ నాయకుల మొదలు ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఇలాంటి కార్యక్రమాల ద్వారా తెలంగాణలో గ్రీనరి గణనీయంగా పెరిగింది. అతి తక్కువ కాలంలోనే ఇది సాధ్యమైంది. నివేదికలు కూడా సూచిస్తున్నాయి. ఇలాంటి మంచి కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పాల్గొని మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని దినేష్ చౌదరి కోరారు.
- Advertisement -