స్ధానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ హవా కొనసాగింది. ఆ పార్టీ బలపర్చిన అభ్యర్థులు ఘన విజయం సాధించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెండు స్థానాల్లోనూ టీఆర్‌ఎస్ పార్టీ ఘనవిజయం సాధించింది. ఇక్కడ టీఆర్‌ఎస్ అభ్యర్థులుగా ఉన్న భానుప్రసాద్, ఎల్.రమణ ఇద్దరూ గెలుపొందారు. భానుప్రసాద్‌కు 584 ఓట్లు రాగా, రమణకు 479 ఓట్లు వచ్చాయి.
ఆదిలాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి విట్టల్ ఘన విజయం సాధించారు. ఇక్కడ మొత్తం 862 ఓట్లు పోలవగా.. టీఆర్‌ఎస్ అభ్యర్థి విట్టల్‌కు మొత్తం 740 ఓట్లు వచ్చాయి.స్వతంత్ర అభ్యర్థి పుష్కరానికి కేవలం 74 ఓట్లు మాత్రమే వచ్చాయి. మొత్తం 666 ఓట్ల మెజార్టీతో విట్టల్ విజయం సాధించారు.
ఇక మెదక్‌లో టీఆర్ఎస్ విజయబావుటా ఎగురవేసింది. టీఆర్‌ఎస్ అభ్యర్థి యాదవరెడ్డికి 762 ఓట్లురాగా కాంగ్రెస్ అభ్యర్థికి 238 ఓట్లే పోలయ్యాయి. స్వతంత్ర అభ్యర్థికి కేవలం ఆరు ఓట్లే వచ్చాయి. మెదక్ ఎమ్మెల్సీ స్థానంలో మొత్తం 12 ఓట్లు చెల్లనివిగా తేలాయి.