టీఆర్‌ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థుల ప్రకటన..

240
CM KCR
- Advertisement -

తెలంగాణలో జరగనున్న లోక్ సభ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ తరపున పోటీ చేసే అభ్యర్థుల పేర్లను ఈ నెల19న ప్రకటిస్తుందని అంతా అనుకున్నారు. కానీ అనుకున్న విధంగా ప్రకటన వెలువడలేదు.. నేడు నిజామాబాద్ టీఆర్‌ఎస్ పార్లమెంటరీస్థాయి సన్నాహక బహిరంగ సభలో నిర్వహించారు. ఈ సభలో  సీఎం కేసీఆర్‌ పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో ఎంపీ అభ్యర్థులను ఎప్పుడు ప్రకటించబోయేది తెలిపారు. ఈ నెల 21వ తేదీన టీఆర్‌ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థుల పేర్లను ప్రకటించనున్నట్లు ఆయన తెలిపారు. కాగా మొత్తం 17 లోక్ సభ స్థానాలకు గాను టీఆర్ఎస్ 16 ఎంపీ అభ్యర్థులను ప్రకటించనుంది. ఇందులో ఇద్దరిని ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే.

ఈ సందర్భంగా బహిరంగ సభలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. మొన్న ఎమ్మెల్యేలందరిని గెలిపించినారు. ఇప్పుడు ఎంపీలను కూడా 16కు 16 గెలిపించాలన్నారు. ఆ శక్తితోని ఆ బలంతోని రాష్ట్రాన్ని బాగుచేసుకోవడమే కాదు కచ్చితంగా దేశానికి కూడా ఒక మార్గదర్శిగా చేద్దామన్నారు. దానికి మీ దీవెన, మీ సహకారం కావాలని కోరుతున్నానని సీఎం అన్నారు. ఎవరు అభ్యర్థి అయినా సరే దయచేసి మీ దీవెన ఇచ్చి కారు గుర్తుకు పెద్ద ఎత్తున ఓటేసి గెలిపించాలని మీ అందరినీ కోరుతున్నాని సీఎం పేర్కొన్నారు.

- Advertisement -