తెలంగాణ వ్యాప్తంగా నిరసనల సెగ రగులుకుంది. గత రాత్రి జరిగిన టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై తెలంగాణ వ్యాప్తంగా ప్రజలందరూ నిరసనలు చేపట్టారు. రాష్ట్ర బీజేపీ నాయకులు, మోదీ దిష్టి బొమ్మలను దహనం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా జరిగిన ఈ నిరసన కార్యక్రమంలో వివిధ నియోజకవర్గాల టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
దేశంలో అవినీతి సొమ్ముతో ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఎమ్మెల్యే బాల్క సుమన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలో బీజేపీ ఇలాంటి నీచమైన పనికి దిగిందని మండిపడ్డారు. ఈ సందర్భంగా మునుగోడు నియోజకవర్గంలోని చండూరులో ఎమ్మెల్యేలు దాస్యం వినయ్ భాస్కర్, బాల్క సుమన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. బీజేపీ దిష్టి బొమ్మలను దగ్ధం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ఎస్ శ్రేణులు తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్‌రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.
మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా టీఆర్ఎస్ శ్రేణులు నిరసనలు తెలిపారు. జిల్లా కేంద్రంలో మున్సిపల్ చైర్మన్ రామ్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో నిరసన తెలిపి ప్రధాని మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఖమ్మంలోని ఎల్కనూరులో మోదీ దిష్టిబొమ్మను టీఆర్‌ఎస్ నాయకులు కాల్చివేశారు.
ఆసీఫాబాద్ జిల్లా కేంద్రంలో జడ్పీ చైర్ పర్సన్ కోవలక్ష్మి, ఎమ్మెల్యేలు కోనేరు కోనప్ప, ఆత్రం సక్కు ఆధ్వర్యంలో పీఎం మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ శ్రేణులు భారీ సంఖ్యలో హాజరయ్యారు.
టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలుకు ఎరవేసిన బీజేపీ తీరును నిరసిస్తూ సిద్దిపేటలోని మంత్రి హరీశ్‌రావు క్యాంపు కార్యాలయం నుంచి బ్లాక్ ఆఫీస్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ప్రధాని మోదీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్ శ్రేణులు ప్రజలు పెద్ద ఎత్తున్న తరలివచ్చి బీజేపీపై తమ నిరసనను వ్యక్తం చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాలోని ముఖ్య పట్టణాలు మరియు హైదరాబాద్, ఆదిలాబాద్, నిర్మల్, రాజన్న సిరిసిల్లా, జోగులాంబ గద్వాల, వనపర్తి, కరీంనగర్ జిల్లాలలోని ప్రజలు టీఆర్‌ఎస్ కార్యకర్తలు ఉవ్వెత్తున్న ఎగిసి నిరసనలు చేపట్టి…ప్రధాని మోదీ, బండి సంజయ్, కిషన్ రెడ్డిల దిష్టి బొమ్మలను దగ్ధం చేశారు.
ఇవి కూడా చదవండి..