‘కల్కి’కే ట్రబుల్ ఇస్తున్నాడా?

14
- Advertisement -

సంతోష్ నారాయణన్ భారతదేశానికి చెందిన టాప్ సంగీత దర్శకుల్లో ఆయన ఒకరు. 2012లో పా. రంజిత్ దర్శకత్వంలో విడుదలైన అట్టకత్తి సినిమా ద్వారా సంగీత దర్శకునిగా సినీరంగంలోకి అరంగేట్రం చేసి.. అద్భుతమైన సంగీతం అందించాడు. అందుకే, ప్రభాస్ కల్కి సినిమాకి ఏరి కోరి తెచ్చుకున్నారు. కానీ ఇప్పుడు కల్కి సినిమాకు అదే శాపంగా మారిందని ఇండస్ట్రీ ఇన్ సైడ్ వర్గాల బోగట్టా. సంతోష్ నారాయణన్ సకాలంలో ట్యూన్ లు ఇవ్వడకపోవడం అన్నది కల్కి సినిమాకి అతి పెద్ద సమస్య అని తెలుస్తోంది. నిజానికి సంతోష్ నారాయణన్ తో గతంలో సినిమాలు చేసిన వారు కూడా ఇదే కంప్లైంట్ చెబుతారు.

పైగా ఫోన్ లకు ఆన్సర్ కూడా వుండదని అంటారు. సరే, మొత్తానికి ‘కల్కి 2898 AD’ సినిమాకు కూడా సంతోష్ నారాయణన్ ట్రబుల్ ఇస్తున్నాడన్నది టాలీవుడ్ లో వినిపిస్తున్న సారాశం. సినిమాలో కల్కి అవతారం సందర్భంగా వచ్చే పాట ఒకటి వుందట. ఆ పాటకు ట్యూన్ ఇవ్వక, కొన్నాళ్ల క్రితం వేసుకున్న షెడ్యూలు కూడా క్యాన్సిల్ చేసుకోవాల్సి వచ్చిందని తెలుస్తోంది. ఆ షెడ్యూల్ కోసం ప్రభాస్ – అమితాబ్ బచ్చన్ బాలీవుడ్ నుంచి వచ్చి మళ్లీ వెనక్కి వెళ్లిపోవాల్సి వచ్చిందని టాక్.

ఆ విధంగా ప్రభాస్ – అమితాబ్ డేట్ లు వృధా అయ్యాయని తెలుస్తోంది. సంతోష్ నారాయణన్ ట్యూన్స్ ఇవ్వడం, రీరికార్డింగ్ చేయడం మీద సినిమా విడుదల తేదీ ఆధారపడి వుందని, అనుకున్న టైమ్ కు ఇస్తే అనుకున్న డేట్ కు వస్తుందని తెలుస్తోంది. సంతోష్ నారాయణన్ వర్క్ బాగుంటుంది. అందులో సందేహం లేదు. కానీ ఎంత వర్క్ బాగున్నా సినిమాను ఇన్ టైమ్ లో ఫినిష్ చేయడానికి సహకారం కూడా అవసరం కదా?. అన్నట్టు 2024 మే 9న కల్కి చిత్రాన్ని విడుదల చేస్తున్నట్టుగా మేకర్స్ ఇప్పటికే కన్ఫర్మ్ చేశారు. ఇది కూడా సంతోష్ నారాయణన్ వర్క్ మీదే ఆధారపడి ఉంది.

Also Read:అవకాడో తింటే ఉపయోగాలే.. కానీ?

- Advertisement -