మరోసారి విష్ణుపై ట్రోలింగ్..

83
vishnu
- Advertisement -

మరోసారి మా అధ్యక్షుడు,నటుడు మంచు విష్ణుపై ట్రోలింగ్ జరుగుతోంది. ప్రస్తుతం విష్ణు, ఇషాన్ దర్శకత్వంలో గాలి నాగేశ్వరరావు సినిమా చేస్తున్న విషయం విదితమే. రాజ్ పుత్, సన్నీ లియోన్ హీరోయిన్లుగా నటిస్తుండగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.

సినిమాకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్‌డేట్ ఇస్తున్న విష్ణు…తాజాగా ఒక సాంగ్ కోసం డాన్స్ రిహార్సల్స్ చేస్తున్నాని, నా బాడీ మొత్తం హార్ట్ అయ్యినట్లు ట్వీట్ చేశాడు. దీంతో ట్రోలర్స్ తమదైన శైలిలో విష్ణుని ఆడేసుకుంటున్నారు.

డాన్సా? ఫైట్ సీన్ అయ్యుంటదిలే అంటూ మీమ్స్‌తో రచ్చ చేస్తుండగా ఈ సెటైర్లు గమనించిన మంచు విష్ణు…నా కొరియోగ్రాఫర్ కూడా నా డాన్స్ మూవ్ మెంట్స్ ఫైట్ సీక్వెన్స్ లా ఉంటాయని అని రిప్లై ఇచ్చాడు. మరికొంతమంది సన్నీ లియోన్ తోనే సాంగ్ అయ్యి ఉంటుంది.. అందుకే కొంచెం గట్టిగా కష్టపడినట్లున్నావ్ అని సెటైర్ వేస్తున్నారు.

- Advertisement -