గోపిచంద్ ఫ్యాన్స్‌కు షాక్‌!

90
gopichand
- Advertisement -

నటుడు గోపిచంద్ ఫ్యాన్స్‌కు షాకింగ్ న్యూస్. కొంతకాలంగా హిట్ కోసం ఎదురుచూస్తున్న గోపిచంద్…శ్రీవాస్ దర్శకత్వంలో సినిమాపై భారీ ఆశలు పెట్టుకున్నాడు.గోపీచంద్ 30 వ సినిమాగా పూజా కార్యక్రమాలతో మొదలైన ఈ సినిమా ఇటీవలే మైసూర్ లో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.

ఇక ఈ నేపథ్యంలోనే ఒక ఫైట్ సీన్ కోసం డూప్ లేకుండా పాల్గొన్న గోపీచంద్ ప్రమాదానికి గురయ్యాడు. షూటింగ్ స్పాట్ లో కాలు జారీ కింద పడినట్లు మేకర్స్ తెలిపారు. అయితే ప్రస్తుతం గోపీచంద్ ఆరోగ్యం నిలకడగానే ఉందని, అభిమానులు ఎవ్వరు ఆందోళన పడాల్సిన పనిలేదన్నారు. దీంతో తమ అభిమాన నటుడు త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నారు ఫ్యాన్స్‌.

తనకు రెండు విజయాలను అందించిన శ్రీవాస్ దర్శకత్వంలో మూడో సినిమా చేస్తున్న గోపిచంద్ ఈసారైన హిట్ కొడతారా లేదా చూడాలి..

- Advertisement -