ప్చ్.. పెళ్లిలో కూడా వేదింపులేనా ?

99
- Advertisement -

సౌత్ లో పాపులర్ హీరోయిన్ లలో ఒకరు హన్సిక. చైల్డ్ ఆర్టిస్ట్ గా సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన హన్సిక, ఆ తర్వాత హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి సక్సెస్ అయింది. మొన్నే ఆమె సోహాల్ కతూరియా ను వివాహం చేసుకుంది. అయితే హన్సిక వివాహ వేడుకలో ఆశ్చర్యకరంగా పెళ్లికి వచ్చిన అతిథులు ఆమె శరీర ఆకృతి గురించి వ్యంగ్యంగా కామెంట్లు చేశారని చెప్పింది. కారణం బొద్దుగా ముద్దుగా ఉండే హన్సిక.. ఈ మధ్య బాగా సన్నబడింది.

దాంతో తనపై ఎప్పటి నుంచో ట్రోల్స్ వస్తున్నాయని చెప్పింది. అయితే బాడీ షేమింగ్ ట్రోల్స్ తనకు కొత్తేమీ కాదని, బయటే కాకుండా సోషల్ మీడియాలో ఎప్పుడూ తనపై ట్రోలింగ్స్ జరుగుతూనే ఉంటాయని హన్సిక ఎమోషనల్ అయింది. ముఖ్యంగా తన పెళ్లి వేడుకలోనూ కొంతమంది తన బాడీ గురించి కామెంట్స్ చేయడం బాధాకరమని హన్సిక ఫీల్ అయింది.

ప్రస్తుతం తన శరీరంతో తాను సంతృప్తిగా ఉన్నానని, తాను కావాలి అనుకుంటే బరువు పెరుగుతాను అని హన్సిక తెలిపింది. కేవలం వృత్తి పరంగా బరువు తగ్గాల్సిన అవసరం ఉండటంతోనే.. తాను బాగా సన్నబడ్డాను అని, తనకేం ఎలాంటి వ్యాధులు లేవు అని, అనవసరంగా తన కామెంట్స్ చేయడం వలన ఇతరులకు వచ్చే లాభం ఏంటో అర్థం కావడంలేదని హన్సిక పేర్కొంది. మొత్తానికి పెళ్లిలో కూడా బాడీ షేమింగ్ వేదింపులు బాధపెట్టాయని హన్సిక చెప్పడం ఆశ్చర్యకరం.

ఇవి కూడా చదవండి..

- Advertisement -