నటసింహం బాలయ్య బాబు అనంతపురం పర్యటనలో ఆసక్తికర కామెంట్స్ చేశారు. బాలయ్య మీడియాతో మాట్లాడుతూ.. ‘ఎవరైనా నాకు వయసు పైబడింది అంటే.. వాళ్లకు దబిడిదిబిడే. నా సినిమాల్లో వినోదం.. విజ్ఞానంతో పాటు సందేశం కూడా ఉంటుంది. నేను టాక్ షోలతో ప్రేక్షకులకు వినోదాన్ని అందిస్తున్నాను అంటూ బాలయ్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. అన్నట్టు బాలయ్య నటించిన ‘వీర సింహారెడ్డి’ మూవీ సక్సెస్ అవ్వడంతో వీర సింహుని విజయోత్సవం పేరిట ఒక సక్సెస్ మీట్ నిర్వహించడం, ఆ వేడుకలో బాలయ్య ఫ్లోలో అక్కినేని తొక్కినేని అని మాట్లాడటంపై అక్కినేని ఫ్యాన్స్ ఫైర్ అవ్వడం తెలిసిందే.
అయితే, తాజాగా తాను అక్కినేని పై చేసిన వ్యాఖ్యలపై కూడా బాలయ్య స్పందించారు. ‘అక్కినేనిని కించపరిచేలా నేను మాట్లాడలేదు. యాదృచ్చికంగా అన్న మాటలే తప్ప నేను కావాలని అనలేదు అని బాలయ్య అన్నారు. అక్కినేని నాగేశ్వర్ రావు గారిని బాబాయ్ అని పిలిచేవాడిని. బాబాయ్ పై ప్రేమ నాకు గుండెల్లో ఉంది. పొగడ్తలకి పొంగిపోవద్దని ఆయన దగ్గరి నుండే నేర్చుకున్నాను. NTR, ANR ఇండస్ట్రీకి రెండు కళ్ళు అని బాలయ్య అన్నారు.
మరోపక్క బాలయ్య వ్యాఖ్యల విషయంపై అన్నపూర్ణ స్టూడియో వారు బాలయ్య పై బ్యాన్ విధించారు అంటూ ఓ వార్త బాగా వైరల్ అవుతుంది. కానీ అవన్ని వట్టి రూమర్స్ అని అన్నపూర్ణ స్టూడియో వాళ్ళు క్లారిటీ ఇచ్చారు. బాలయ్య పై అన్నపూర్ణ స్టూడియో బ్యాన్ అనేది నిజం కాదని తేల్చి చెప్పారు.
ఇవి కూడా చదవండి…