- Advertisement -
వరుస సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు యంగ్ టైగర్ ఎన్టీఆర్. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ మూవీ చేస్తున్న ఎన్టీఆర్ ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సినిమా చేయనున్నారు.
లాక్ డౌన్ కారణంగా ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్‌కు బ్రేక్ పడింది. ఈ సినిమా షూటింగ్ పూర్తయితే సెప్టెంబర్‌లో త్రివిక్రమ్ సినిమా పట్టాలెక్కించాలనుకున్నారు. కానీ కరోనా కారణంగా సినిమా షూటింగ్ ఆలస్యంగా ప్రారంభమయ్యే అవకాశం ఉంది.
పాన్ ఇండియా మూవీగా ఈసినిమా తెరకెక్కనుండగా ఎన్టీఆర్ సరసన శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్‌తో శృతి హాసన్ ను తీసుకున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. రీసెంట్‌గా త్రివిక్రమ్‌తో అరవింద సమేతతో హిట్ కొట్టిన ఎన్టీఆర్…ఈ మూవీపై కూడా భారీ ఆశలు పెట్టుకున్నాడు.
- Advertisement -