వైజాగ్ అంటే అందమైన అమ్మాయిలు

521
Trivikram
- Advertisement -

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అల్లు అర్జున్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం అల..వైకుంఠపురంలో. సంక్రాంతి కానుకగా జనవరి 12 విడుదలైన ఈమూవీ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈసందర్భంగా ఈమూవీ సక్సెస్ మీట్ ను నిన్న వైజాగ్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున మెగా అభిమానులు హాజరయ్యారు.

ఈ కార్యక్రమంలో వైజాగ్ అమ్మాయిల గురించి వివరించారు త్రివిక్రమ్ శ్రీనివాస్. ఈసందర్భంగా త్రివిక్రమ్ మాట్లాడుతూ… వైజాగ్ అంటే ముందుగా గుర్తుకువచ్చేది అందమైన అమ్మయిలు అని చెప్పారు. విశాఖపట్నంలోని ఆంధ్ర యూనివర్సిటిలో తాను చదువుకున్నట్లు గుర్తు చేశారు. ఇక్కడే శ్రీశ్రీ తన మహాప్రస్థానం ప్రతులను పట్టుకుని రోడ్లపై తిరిగారని అన్నారు. రావిశాస్త్రి, సీతారామశాస్త్రి వంటి ఎందరో మహానుభావులను అందించిన వైజాగ్, ఎన్నో ఒంపులున్న మహానగరమని, ఈ నగరానికి తాను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని అన్నారు.

- Advertisement -