రామ్ చరణ్ తో త్రివిక్రమ్..నిర్మాతగా పవన్ కళ్యాణ్

305
ram charan pawan kalyan
- Advertisement -

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇటివలే అల్లు అర్జన్ తో అల..వైకుంటపురంలో సినిమాను తెరకెక్కించాడు. ఈమూవీ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈమూవీ అల్లు అర్జున్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఈమూవీ తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ ఎన్టీఆర్ తో సినిమా చేయనున్నాడు. ఇప్పటికే ఈమూవీ స్క్రీప్ట్ వర్క్ కూడా పూర్తైంది. ఈమూవీకి అయినను పోయరావాలే హస్తినకు అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఎన్టీఆర్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఈమూవీ షూటింగ్ సెప్టెంబర్ లో పూర్తి కానుంది. దీంతో దసరా తర్వాత త్రివిక్రమ్ ఎన్టీఆర్ ల మూవీ రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభంకానుంది.

అయితే లాక్ డౌన్ కారణంగా షూటింగ్ లు నిలిపివేయడంతో ఈమూవీ ప్రారంభం మరింత ఆలస్యంకానుంది. ఇక ఈమూవీ తర్వాత త్రివిక్రమ్ మరో హీరోను లైన్ లో ఉంచాడు. తాజాగా ఉన్న సమాచారం మేరకు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తో త్రివిక్రమ్ సినిమా చేయనున్నాడట. ఇందుకు సంబంధించిన స్క్రీప్ట్ వర్క్ ను రెడీ చేస్తున్నాడట దర్శకుడు త్రివిక్రమ్. ఆర్ఆర్ఆర్ మూవీ తర్వాత మరే సినిమాను ఒప్పుకోలేదు రామ్ చరణ్. అయితే రామ్ చరణ్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కబోయే సినిమాను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బ్యానర్ లో తెరకెక్కనున్నట్లు తెలుస్తుంది. ఈమూవీకి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే తెలియనున్నారు. ఒకవేళ రామ్ చరణ్ తో గనుక త్రివిక్రమ్ సినిమా చేస్తే ఎన్టీఆర్ మూవీ పూర్తైన తర్వాతే చేయాల్సి ఉంటుంది.

- Advertisement -