ఆ ముచ్చట కారణంగానే ‘త్రివిక్రమ్’ కు ముచ్చెమటలు !

99
trivikram
- Advertisement -

త్రివిక్రమ్ సినిమా అంటేనే.. కుటుంబం, బంధాలు, అనురాగాలు, ఆప్యాయ‌త‌లు.. వీటన్నిటిని కలుపుతూ సాగే సెంటిమెంట్.. మధ్య‌లో హీరోయిజం, పంచ్‌లూ.. ఇవ‌న్నీ కలగలిపి ఓ ఓరలో కలబోసినట్టు సాగుతాయి. ‘అతడు సినిమా నుంచి… అల వైకుంఠపురములో’ వ‌ర‌కూ త్రివిక్రమ్ న‌మ్ముకొన్న ఫార్ములా ఇదే. ఐతే, త్రివిక్రమ్, ప్ర‌స్తుతం మహేష్ బాబుతో ఓ పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకి త్రివిక్రమ్ త‌న పంథాని పూర్తిగా మార్చుకున్నాడు. ఈ సినిమాలో ఫ్యామిలీ డ్రామా అనే ఎపిసోడ్ ని పూర్తిగా ప‌క్క‌న పెట్టేసి.. యాక్ష‌న్ అండ్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ పై దృష్టి నిలిపార‌ని తెలుస్తోంది. పూర్తిగా ఈ సినిమా థ్రిల్లింగ్ నేప‌థ్యంలోనే సాగుతుంద‌ని, ముఖ్యంగా త్రివిక్రమ్ మార్క్ కుటుంబ స‌న్నివేశాలు ఏమాత్రం క‌నిపించ‌బోవ‌ని ఇన్ సైడ్ వ‌ర్గాలు చెబుతున్నాయి.

నిజానికి మొదట, త్రివిక్రమ్, మహేష్ కోసం ‘అరవింద సమేత’ టైపు క‌థే సిద్ధం చేశాడు. అరవింద సమేతలో యాక్ష‌న్ తో పాటు, ఫ్యామిలీ ఎమోష‌న్స్ బ‌లంగా ఉంటాయి. కానీ, మహేష్ మాత్రం ఈసారి పాన్ ఇండియాని టార్గెట్ చేస్తూ ఎక్కువగా యాక్ష‌న్‌ పైనే ఫోక‌స్ చేయ‌మ‌ని స‌ల‌హా ఇచ్చాడు. దాంతో.. త్రివిక్రమ్ కి స్క్రిప్టులో కీల‌క మార్పులు చెయ్యక తప్పలేదు. అందుకే, ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి ఇప్పటికే షూట్ చేసిన సీన్స్ ను కూడా పక్కన పెట్టారు. మొత్తానికి పాన్ ఇండియా ముచ్చట మహేష్ లోనే కాదు, త్రివిక్రమ్ కథల్లోనూ చాలా మార్పులను తీసుకొచ్చింది.

ఇప్పుడంతా పాన్ ఇండియా ట్రెండే నడుస్తోంది. ఐతే, పాన్ ఇండియా ఇమేజ్ కోసం స్టార్ హీరోలు పడుతున్న ముచ్చటే.. డైరెక్టర్లకు ముచ్చెమటలు పట్టిస్తోంది. అసలు పాన్ ఇండియా ఫ్యాక్ట‌ర్ ని దృష్టిలో పెట్టుకొని కథ రాయడం కుదిరే పని కాదు. ఒక్కో భాషలో ఒక్కో ఎమోషన్ని ఒక్కోలా రిసీవ్ చేసుకుంటారు. తమిళంలోని ఫ్యామిలీ ఎమోషన్స్ తెలుగు ప్రేక్షకులకు నచ్చకపోవచ్చు. తెలుగులోని ల్యాగ్ బిల్డప్ వ్యవహారాలు హిందీ వాళ్లకు నచ్చకపోవచ్చు. హిందీ అతి మిగిలిన భాషలలోని ఎవ్వరికి నచ్చకపోవచ్చు. అందుకే, పాన్ ఇండియా కథ వండటం చాలా కష్టం. ఇదే అసలు కారణం.. ఎప్పుడూ లేనిది క‌థ విష‌యంలో త్రివిక్రమ్ చాలా మ‌ల్ల‌గుల్లాలు పడ్డాడు. ఇంకా పడుతున్నాడు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -