పవన్ కథలో వెంకీ హీరో..!

257
Victory Venkatesh
- Advertisement -

విక్టరీ వెంకటేష్ ప్రస్తుతం వరుణ్ తేజ్‌తో కలిసి ‘ఎఫ్ 2’ అనే చిత్రాన్ని చేస్తున్న విషయం తెల్సిందే. అనీల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు భారీగా నిర్మిస్తున్నాడు. సంక్రాంతికి విడుదల కాబోతుంది ఈ మూవీ. అంతేకాదు నాగ చైతన్యతో కలిసి వెంకటేష్ మరో సినిమాకు సిద్దం అవుతున్నాడు. దర్శకుడు బాబీ ఈ మల్టీస్టారర్‌కు కథను సిద్దం చేస్తున్నాడు. ఈ సినిమకు ‘వెంకీ మామ’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఈ రెండు ప్రాజెక్ట్స్‌ పూర్తయ్యాక వెంకీ.. త్రివిక్రమ్ డైరెక్షన్‌లో ఓ మూవీ చేయనున్నాడని సమాచారం.

Victory Venkatesh

ఇక అసలు విషయం ఏంటంటే.. ఈ కథను పవన్ కోసం త్రివిక్రమ్ సిద్ధం చేయగా, తనకి బాగా నచ్చిందని పవన్ అన్నాడట. ఆ తరువాత పవన్ రాజకీయాల్లో బిజీగా మారిపోయాడు. అందువలన త్రివిక్రమ్ అదే కథను వెంకటేష్‌తో చేయనున్నాడనేది తాజా సమాచారం. ‘అరవింద సమేత’ విడుదల కాగానే త్రివిక్రమ్ ఈ ప్రాజెక్టు పనులు మొదలుపెడతాడని అంటున్నారు.

- Advertisement -