త్రివిక్రమ్ .. వెరీ వెరీ స్పెషల్ స్పీచ్

305
Trivikram Out Standing Motivational Speech
- Advertisement -

కొంత మంది మాటలకు ముత్యాలు రాలుతాయి కానీ త్రివిక్రమ్ మాటలకు బాక్సఫీస్ దగ్గర కాసుల వర్షం కురుపిస్తాయి. చిలిపితనం,వెటకారంతో పాటు హృదయాలను గుచ్చే మాటలు రాస్తాడు. అతడు రాసే ప్రతి డైలాగూ ప్రత్యేకమే. అందుకే త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటల మాంత్రికుడయ్యాడు. తాజాగా తన మాటల్లోని పదునును.. ఇటీవల జరిగిన అమర్‌రాజా బ్యాటరీస్ ఫౌండేషన్ డే సందర్భంగా అందరికీ చూపించాడు. దాదాపు 7 నిముషాల ప్రసంగంలో నాలుగు యుగాలను పోలుస్తూ మాట్లాడిన మాటల మాంత్రికుడు విలువలతో కూడిన వ్యాపారం చేయటం కష్టం చేసిన ప్రసంగం అందరిని మంత్రముగ్దులను చేసింది.

‘మనకు నాలుగు యుగాలు ఉన్నాయి. కృతయుగంలో వేదాల కోసం అంటే జ్ఞానం కోసం యుద్ధం జరిగింది. త్రేతాయుగంలో సీత కోసం అంటే ఓ అమ్మాయి కోసం యుద్ధం జరిగింది. ద్వాపర యుగంలో ఆస్తి కోసం యుద్ధం జరిగింది. ఇప్పుడు కలియుగంలో డబ్బుల నోట్ల కోసం యుద్ధాలు జరుగుతున్నాయి. ఒక్కో యుగంలో యుద్ధం జరగడానికి గల కారణం విలువ తగ్గిపోతోంది. అలాగే కృతయుగంలో సముద్రం అడుగున యుద్ధం జరిగింది. త్రేతా యుగంలో ఓ సముద్రం దాటితే సరిపోయింది. ద్వాపర యుగంలో భూమిపైనే యుద్ధం జరిగింది. ఇప్పుడు మనిషి మెదడు.. ఆలోచనలోనే యుద్దం జరుగుతోంది’ అన్నాడు త్రివిక్రమ్ శ్రీనివాస్.

మరిప్పుడు వార్ ఫీల్డ్ ఎక్కడంటే.. అది మనలోనే ఉంది. డబ్బు సంపాదించడానికో.. పేరు గొప్పకో.. లేదంటే ఇంకేదైనా గెలవడానికో ఓ తప్పు చేస్తాం. అబద్ధం చెప్తాం. ఆ తర్వాత మనమే గిల్టీగా ఫీలవుతాం. మనలో మనమే సంఘర్షణ అనుభవిస్తాం. మనతో మనమే కొట్టుకుంటాం. తర్వాత మనమే చచ్చిపోతాం. కాబట్టి వార్ ఫీల్డ్ ఇప్పుడు మరింత దగ్గరకు వచ్చేసింది. మనలోపలికి ఎంటరైపోయింది. ఇలాంటి సమయంలో విలువలతో వ్యాపారం చేయడం చాలా కష్టమైన విషయం. ఎందుకంటే విలవలు, వ్యాపారం రెండూ పూర్తి వ్యతిరేకంగా మారిపోయాయి. ఒకప్పుడు రెండూ కలిపి చేయడం కుదిరేది. ఇప్పుడది సాధ్యం కావడం లేదు’’ అన్నాడు.

కార్లో బ్యాటరీ ఉంటుందని తెలుసు. కానీ, బ్యాటరీ వెనక ఇంతమంది ఉంటారని మాత్రం నాకు నిజంగా తెలియదు. మూడు..నాలుగు రోజుల నుంచి జీవితంలో బ్యాటరీ ఎంత ఇంపార్టెంటో తెలుస్తోంది. నేను భీమవరంలో ఉన్నప్పుడు నా మిత్రులు ఓ స్కూల్ పెడితే.. యాడ్ ఫిల్మ్ తీయాల్సిందిగా కోరారు. దేవుడి దయ వల్ల ఆ యాడ్ రాలేదు. ఎవరూ చూడలేదు. ఒకవేళ చూసుంటే.. ఇలా ఎవరూ నాకు సినిమా ఆఫర్లు ఇచ్చేవారు కాదేమో. ఎందుకంటే.. ఏం తీయాలో తెలియక రోజంతా తీస్తూనే ఉన్నాను. నేను జల్సాలో ఓ డైలాగ్ రాశాను. గాలి, నేల, నీరు, నిప్పు, ఆకాశం.. ఇవన్నీ మనుషులందరికీ సమానం. కానీ, ఏ ఒక్కరికో దానిపై కాపీరైట్ ఉండడం సరికాదని రాశాను. రాయడమే కాదు.. అదే నా వ్యక్తిగత అభిప్రాయం కూడా. ఒక్కో యుగంలోను ఇలా దిగజారిపోతున్నామని.. కానీ విలువలను.. వ్యాపారాన్ని కలిపి ఏకతాటిపై నడిపించడంతోనే తనకు ఈ కంపెన అంటే ఇష్టం అన్నాడు మాటల మాంత్రికుడు. ఈ రెండింటినీ పాటించడం కష్టమైనా.. నిజాయితీకా కొనసాగిస్తున్న బ్యాటరీల తయారీ సంస్థకు అభినందనలు చెప్పాడు.

- Advertisement -