త్రివిక్రమ్ – బన్నీ.. మరో యాడ్.. ఆ తర్వాత మహేష్ తో కూడా !

117
- Advertisement -

సూపర్ స్టార్ మహేష్ బాబు – త్రివిక్రమ్ కాంబినేషన్ లో రెండు సినిమాలు వచ్చాయి. మూడో సినిమా రాబోతుంది. చేసిన రెండు సినిమాల్లో ఒక ప్లాప్ ఉన్నా.. ఈ కాంబినేషన్ మాత్రమే సూపర్ హిట్టే. త్వరలోనే మూడో సినిమా కూడా మొదలుకానుంది. అయితే.. ఈ మూడో సినిమాకి వీరిద్దరూ చాలా గ్యాప్ తీసుకున్నారు. కాకపోతే.. ఈ గ్యాప్ లో మాత్రం మహేష్ – త్రివిక్రమ్ కలిసి అనేక యాడ్స్ చేశారు. మహేష్ కి ఎలాగూ రాజమౌళి సినిమాతో పాన్ ఇండియా స్టార్ ఇమేజ్ రానుంది. దాంతో, ముందుగానే మహేష్ కి అనేక బ్రాండ్స్ వచ్చి పడుతున్నాయి. ఇక యాడ్స్ తీయడంలో త్రివిక్రమ్ కి మంచి అనుభవం ఉంది. పైగా మంచి విజన్ ఉంది.

అందుకే.. తెలుగులో యాడ్ తీయాలంటే ముందుగా అందరికీ త్రివిక్రమ్ నే గుర్తుకొస్తున్నాడు. దాంతో, బన్నీ- త్రివిక్రమ్ కాంబినేషన్ లో, అలాగే మహేష్ – త్రివిక్రమ్ కాంబినేషన్ లో, అలాగే ఎన్టీఆర్ – త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఇప్పటికే పలు యాడ్స్ వచ్చాయి. ఇంకా వస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే త్వరలోనే ఓ ముంబై కంపెనీ కోసం మహేష్ బాబు – త్రివిక్రమ్ కలిసి మరో యాడ్ చేయబోతున్నారని తెలుస్తోంది.

అన్నట్టు ఈ యాడ్ కోసం ఇప్పటికే మహేష్ డేట్స్ కూడా ఇచ్చాడు. మరోపక్క రామోజీ ఫిలిం సిటీలో త్రివిక్రమ్ నేడు ఓ యాడ్ షూట్ చేస్తున్నాడు. ఓ ఓటీటీ బ్రాండ్ కోసం బన్నీతో కలిసి త్రివిక్రమ్ ఈ యాడ్ తీస్తున్నాడు. ఆ ఓటీటీ బ్రాండ్ కి బన్నీ అంబాసిడర్. ప్రస్తుతం ఈ యాడ్ షూట్ రేపటి వరకూ జరగనుంది.

ఇవి కూడా చదవండి..

- Advertisement -