ఇంతకీ, త్రివిక్రమ్ ఏం చేస్తున్నట్టు?

53
- Advertisement -

సూపర్ స్టార్ మహేష్ – త్రివిక్రమ్ కాంబినేషన్ లో రూపొందుతోన్న “గుంటూరు కారం” సినిమా షూటింగ్ ఆగుతూ సాగుతూ వెళ్తోంది. ఇప్పటివరకు 60 శాతం కూడా షూటింగ్ పూర్తి కాలేదు. మరోవైపు, ఈ సినిమా గురించి ఎలాంటి అప్డేట్స్ ఇవ్వడం లేదు ఈ టీం. దాంతో, మహేష్ బాబు అభిమానులకు చిర్రెత్తుకొచ్చింది. త్రివిక్రమ్ పేరుతో నెగిటివ్ ట్వీట్స్ అండ్ మీమ్స్ క్రియేట్ చేసి సోషల్ మీడియాని హోరెత్తిస్తున్నారు. మరోవైపు ఈ సినిమా నిర్మాణ సంస్థ హాసిని హారిక సంస్థ కూడా సైలెంట్ గా ఉంటుంది.

కానీ, తమకు కనీసం షూటింగ్ అప్డేట్స్ కూడా చెప్పడం లేదు అని మహేష్ ఫ్యాన్స్ త్రివిక్రమ్ పై సీరియస్ అవుతున్నారు. సరే.. ఫ్యాన్స్ ఆరోపిస్తున్నారు అంటే.. సరిపెట్టుకోవచ్చు. “గుంటూరు కారం” సినిమా నిర్మాత నాగవంశీ కూడా ఇదే చెబితే ఏమనుకోవాలి ?, నిజానికి నాగవంశీ నిర్మిస్తోన్న మిగతా సినిమాల షూటింగ్ లు స్పీడ్ గా జరుగుతుంటే.. ఒక్క “గుంటూరు కారం” సినిమా మాత్రం ఎప్పుడు స్టార్ట్ అవుతుందో ?, ఎందుకు ఆగిపోతుందో ? కూడా నిర్మాతలకు అర్ధం కావడం లేదు.

Also Read:ఏమైనా చేస్తోందట..ఛాన్స్ ఇస్తారా?

మహేష్ బాబు వల్లే సినిమా ఇలా ఆగుతూ సాగుతూ ఉంది అనేది టీమ్ నుంచి వస్తున్న లీక్. కానీ, ఇవన్నీ డైరెక్ట్ గా చెప్పేవి కావు. చెప్పినా.. ఫ్యాన్స్ తమ హీరోని ఏమీ అనరు. కాబట్టి.. మధ్యలో ఇబ్బంది పడేది నిర్మాతలు మాత్రమే. దీనికితోడు, మహేష్ ఫ్యాన్స్ తమ కోపాన్ని ఇలా నెగిటివ్ పోస్ట్ లతో నిర్మాతల పై చూపిస్తున్నారు. ఇంతకీ, త్రివిక్రమ్ ఏం చేస్తున్నట్టు ?.. ఇదే బాధ నిర్మాతకి ఉంది. కానీ నేరుగా అడిగే ధైర్యమే లేదు. ప్చ్.. పాపం.

Also Read:సబ్జా గింజలు..ఔషధ గుణాలు

- Advertisement -