ఆ లేడీ రైటర్‌ ను కాపీ కొట్టిన త్రివిక్రమ్

23
- Advertisement -

‘నువ్వు నాకు నచ్చావ్’, ‘మన్మథుడు’, ‘మల్లీశ్వరి’ వంటి హిట్ సినిమాలకు కథలు అందించి గొప్ప రైటర్ గా పేరు తెచ్చుకున్న త్రివిక్రమ్.. ఆ తర్వాత దర్శకుడిగా మారి ‘నువ్వే నువ్వే’, ‘అతడు’, ‘జల్సా’ వంటి మూవీస్ తీసి సూపర్ హిట్స్ అందుకున్నాడు. తాజాగా త్రివిక్రమ్ గురించి ఒక విషయం వైరల్ అవుతుంది. ప్రముఖ తెలుగు రచయిత యద్దనపూడి సులోచన రాణి రాసిన నవలల నుంచి త్రివిక్రమ్ కాపీ కొడుతున్నారని నెటిజన్లు అంటున్నారు. అందుకే, త్రివిక్రమ్ సినిమాలు వరుసగా నెగిటివ్ టాక్ తెచ్చుకుంటున్నాయి.

ఈ క్రమంలో వచ్చిన సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ కలయికలో వచ్చిన గుంటూరు కారం సినిమా కూడా నెగిటివ్ టాక్ తెచ్చుకుంది. ఈ మూవీ సంక్రాంతి విడుదలైనప్పటికీ.. బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్స్ కూడా రాబట్టలేకపోయింది. కాకపోతే, కుర్చీ మడత పెట్టి సాంగ్‌ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. కాలా పాషా నొటి నుంచి మొదటగా వచ్చిన ఈ డైలాగ్‌.. మహేష్ సినిమా పాటలో భాగం కావడంతో యూట్యూబ్ లో తెగ చూసేస్తున్నారు. ఈ సాంగ్ 50 మిలియన్ల వ్యూస్ ను సాధించింది.

మొత్తానికి గుంటూరు కారం సినిమా పోయినా, పాట మాత్రం బాగా హిట్ అయ్యింది. ఇక త్రివిక్రమ్ దర్శకత్వంలో హీరో రామ్ కొత్త సినిమా రాబోతుంది. వరుస ఫ్లాపులను ఎదుర్కోంటున్న హీరో రామ్.. ఈ సారి ఎలాగైనా హిట్టు కొట్టాలని చూస్తున్నాడు. బోయపాటితో చేసిన ‘స్కంద’ సినిమా అంచనాలకు చాలా దూరంలోనే ఆగిపోయింది. ఈ నేపథ్యంలో త్రివిక్రమ్ దర్శకత్వంలో చేయనున్నట్టుగా ఒక బలమైన టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాలో హీరోయిన్ గా ఆషిక రంగనాథ్ ఉండే అవకాశాలు ఎక్కువనే టాక్ కూడా వినిపిస్తోంది.

Also Read:Jagan:జగన్ ‘ మేనిఫెస్టో’.. నవరత్నాలకు మించి?

- Advertisement -