స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కు కొంత కాలంగా సరైన హిట్ లేదు. చివరగా ఆయన నటించిన నా పేరు సూర్య నాఇల్లు ఇండియా మూవీ అట్టర్ ప్లాప్ కావడంతో ఆ సినిమా తర్వాత చాలా రోజులు గ్యాప్ తీసుకున్నాడు. విక్రమ్ కుమార్, పరుశురామ్ లాంటి దర్శకులతో చేస్తాడని వార్తలు వచ్చినా వాళ్లను పక్కకు పెట్టి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో మూవీ చేసేందుకు రెడీ అయ్యాడు. న్యూ ఇయర్ సందర్భంగా ఈవిషయాన్ని అధికారికంగా ప్రకటించాడు బన్నీ. ఎలాగైనా ఈమూవీతో పక్కాగా హిట్ కొట్టాలనే కాన్ఫిడెన్స్ తో ఉన్నాడు అల్లు అర్జున్. త్రివిక్రమ్ ప్రస్తుతం కథను రెడీ చేస్తున్నట్లు సమాచారం.
తాజాగా ఉన్న సమాచారం ప్రకారం వేలంటైన్స్ డే రోజు ఈమూవీని లాంచ్ చేయనున్నట్లు తెలుస్తుంది. ఆ వెంటనే రెగ్యూలర్ షూటింగ్ ను కూడా మొదలు పెట్టి దసరా లోపు సినిమాను విడుదల చేయనున్నట్లు సమాచారం. బన్నీ త్రివిక్రమ్ కాంబినేషన్ వచ్చిన జులాయి, సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమాలు మంచి విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. ఈమూవీలో హీరోయిన్ గా కైరా అద్వానిని తీసుకున్నట్లు తెలుస్తుంది.