త్రివిక్రమ్ మూవీ అప్‌డేట్?

6
- Advertisement -

చాలాకాలం తర్వాత మాటల మాంత్రికుడు భారీ పాన్ ఇండియా చిత్రంతో వస్తున్న సంగతి తెలిసిందే. అయితే బన్నీతో తొలుత సినిమా చేయాల్సి ఉన్నా …అట్లీతో సినిమా చేస్తుండటంతో తన మనసు మార్చుకున్నాడు త్రివిక్రమ్.

తన నెక్స్ట్ చిత్రాన్ని సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్‌తో చేయబోతున్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ సినిమాను తనదైన మార్క్ ఎంటర్‌టైనర్‌గా త్రివిక్రమ్ తెరకెక్కించబోతున్నాడట. ఈ సినిమాలో మరో స్టార్ హీరో కూడా నటిస్తాడని వార్తలు వినిపిస్తున్నాయి.

త్రివిక్రమ్ చేయబోయే మల్టీస్టారర్ చిత్రంలో చరణ్ కూడా నటిస్తాడనే వార్త జోరుగా చక్కర్లు కొడుతోంది. మరి ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ అఫిషియల్‌గా అనౌన్స్‌మెంట్ వస్తే మాత్రం ఫ్యాన్స్‌కు పండగే.

Also Read:కేసిఆర్ అంటేనే తెలంగాణ..తెలంగాణ అంటేనే కేసీఆర్

- Advertisement -