బీజేపీ మంత్రిపై సుప్రీం తీవ్ర ఆగ్రహం

10
- Advertisement -

కల్నల్ సోఫియా ఖురేషి పట్ల మధ్యప్రదేశ్ బీజేపీ మంత్రి కున్వర్ విజయ్ షా చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించింది సుప్రీంకోర్టు. మీరు చేసిన వ్యాఖ్యలకు దేశ ప్రజలంతా సిగ్గుతో తలవంచుకోవాల్సి వచ్చింది, ప్రజాప్రతినిధిగా ఉన్నప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి” అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది ధర్మాసనం.

మంత్రి వ్యాఖ్యలపై విచారణకు ముగ్గురు ఐపీఎస్ అధికారులతో ప్రత్యేక సిట్ నియమించాలని, వారిలో ఒక మహిళా ఐపీఎస్ ఉండాలని ఆదేశించింది సుప్రీంకోర్టు. ఈ నెల 28వ తేదీ లోపు విచారణకు సంబంధించిన నివేదికను అందజేయాలని ఆదేశించింది సుప్రీంకోర్టు.

కల్నల్ సోఫియా ఖురేషిని “ఉగ్రవాదుల సోదరి” అని అన్నందుకు తనపై నమోదైన ఎఫ్ఐఆర్‌ను కొట్టేయాలని సుప్రీంకోర్టుకి వెళ్లారు మంత్రి విజయ్ షా. ఈ సమయంలో జోక్యం చేసుకోలేం అంటూ నిరాకరించింది.

Also Read:కేసిఆర్ అంటేనే తెలంగాణ..తెలంగాణ అంటేనే కేసీఆర్

- Advertisement -