జులై 27 న “మెహిని”గా రానున్న త్రిష‌..

362
- Advertisement -

తెలుగు ప్రేక్ష‌కుల్లో త‌న‌దైన అందంతో అభినయంలో ద‌శాబ్ద‌కాలం గా టాప్ హీరోయిన్‌గా ఆక‌ట్టుకున్న త్రిష తిరిగి మెహినిగా తెలుగు ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. త‌మిళంలో మెహినిగా ఈ చిత్రం తెర‌కెక్కింది. అదే టైటిల్‌తో తెలుగులో కూడా రానుంది. ఈ చిత్రాన్ని వైజాగ్ డిస్ట్రిబ్యూట‌ర్ ల‌క్ష్మిపిక్చ‌ర్స్ తెలుగులో విడుద‌ల చేస్తున్నారు. ఎస్‌. ల‌క్ష్మ‌ణ్ కుమార్. శ్రినివాస‌రావు ప‌ల్లెల, క‌ర‌ణం మ‌ధుల‌తలు సంయుక్తంగా ప్రిన్స్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్ పై నిర్మాణం చేప‌ట్టారు. ఆర్‌.మాదేష్ ద‌ర్శ‌కుడు. హ‌ర్ర‌ర్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ చిత్రం తెర‌కెక్కింది.

Trisha

ఇటీవ‌ల విడుద‌ల చేసిన ఈ చిత్రం ట్రైల‌ర్ అంద‌ర్ని అక‌ట్టుకుంది. ఈ చిత్రం లో త్రిష తో పాటు జాఖీ, యోగి బాబు, పూర్ణిమా భాఖ్యారాజ్ ముఖ్య‌పాత్ర‌ల్లో న‌టించారు. వివేక్-మెర్విన్ సంగీతం అందిస్తున్నారు. ఆర్‌.బి.గురుదేవ్ సినిమాటోగ్రఫి అద్బుతంగా వుంది. థింక్ మ్యూజిక్ ద్వారా ఈ చిత్ంర ఆడియో ని విడుద‌ల చేస్తున్నారు. అయితే ఈ ఆడియోని జులై 19 న విడుద‌ల చేస్తారు. చిత్రాన్ని త‌మిళ‌, తెలుగు భాష‌ల్లో జులై 27 న విడుద‌ల చేస్తున్నారు.

Trisha

ఈ సంద‌ర్బంగా నిర్మాత‌లు మాట్లాడుతూ… త్రిష కి తెలుగులో ఇన్న క్రేజ్ అంద‌రికి తెలుసు.. అయితే హ‌ర్ర‌ర్ చిత్రంగా తెలుగు, త‌మిళ బాష‌ల్లో తెర‌కెక్కుతున్న మెహిని చిత్రం ఈ నెల 27 న ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల‌ చేస్తున్నాము. ఇప్ప‌టికే విడుదల చేసిన ట్రైల‌ర్‌కి మాంచి క్రేజ్ రావ‌టంతో ఈ చిత్రం పై అంచ‌నాలు పెరిగాయి. విజువ‌ల్ గ్రాండియ‌ర్‌గా హ‌ర్ర‌ర్ బ్యూటితో అంద‌ర్ని అల‌రిస్తుంది. మాదేష్ చాలా మంచి కాన్సెప్ట్ తో ఈ చిత్రాన్ని తెర‌కెక్కించాడు. త్రిష ఫెర్‌ఫార్మెన్స్ గురించి ప్ర‌త్యేఖంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఈ చిత్రం అంద‌ర్ని ఆక‌ట్టుకుంటుంది. అని అన్నారు..

Trisha

న‌టిన‌టులు.. త్రిష‌, జాకి, యోగి బాబు, పూర్ణిమ భ‌ఖ్యారాజ్ త‌దిత‌రులు..ద‌ర్శ‌కుడు.. ఆర్‌. మాధేష్‌, సంగీతం.. వివేఖ్ మెర్విన్‌, సినిమాటోగ్ర‌ఫి.. ఆర్‌.బి.గురుదేవ్‌, ఎడిట‌ర్‌.. దినేష్ పూన‌రాజ్‌, స‌హ‌-నిర్మాత‌లు.. గుంటూరు కాశిబాబు, డి.వి.మూర్తి, నిర్మాత‌లు.. ఎస్‌.ల‌క్ష్మ‌ణ్ కుమార్‌, శ్రినివాస‌రావు ప‌ల్లెల‌, క‌ర‌ణం మ‌ధుల‌త‌, బ్యాన‌ర్‌.. ప్రిన్స్ పిక్చ‌ర్స్ మ‌రియు శ్రీ ల‌క్ష్మి పిక్చ‌ర్స్‌.

- Advertisement -