హీరో సిద్దార్ధ్ పై ప్ర‌భాస్ ఫ్యాన్స్ ఫైర్..

312
Siddharth

హీరో సిద్దార్ధ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ పై పెట్టిన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైర‌ల్ గా మారింది. ఈసంద‌ర్భంగా ప్ర‌భాస్ అభిమానులు హీరో సిద్దార్ధ్ పై మండిప‌డుతున్నారు. ప్ర‌భాస్ పుట్టిన రోజు గురించి సిద్దార్ధ్ వెట‌కారంగా పోస్ట్ చేశాడ‌ని నిప్పులు చెరుగుతున్నారు ప్ర‌భాస్ ఫ్యాన్స్. ట్వీట్ట‌ర్ లో సిద్దార్ధ్ పెట్టిన పోస్టుకు చాలామంది అభిమానులు ఆయ‌కు తిడ‌తూ కామెంట్లు పెడుతున్నారు.

Prabhas Siddharth

త‌మిళ సినీ విశ్లేష‌కుడు రమేష్ బాలా త‌న ట్వీట్ట‌ర్ ఖతాలో ప్ర‌భాస్ పుట్టిన రోజును గుర్తు చేస్తూ ఓ ట్వీట్ చేశాడు. డార్లింగ్ ప్ర‌భాస్ పుట్టిన రోజుకు ఇంకా 100రోజులు ఉంద‌ని ఇప్ప‌టికే కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యింద‌ని ట్వీట్ చేశాడు ర‌మేష్ బాలా. ప్ర‌భాస్ అభిమానులు రోజులు లెక్క‌పెట్టుకోవాటంటూ ట్వీట్ చేశాడు. ఈసంద‌ర్భంగా ఈట్వీట్ చూసిన హీరో సిద్దార్ధ్ కూడా ఓ కామెంట్ పెట్టాడు.

ప్ర‌భాస్ త‌రువాతి పుట్టిన‌రోజుకు ఇంకా 465 రోజులుంది అంటూ కామెంట్ పెట్టాడు. సిద్దార్ధ్ పెట్టిన కామెంట్ తో అభిమానులు కోపం రావ‌డంతో సిద్దార్ద్ కు కామెంట్లు పెడుతున్నారు. టాలీవుడ్ జోలికొస్తే నీకు చుక్క‌లు చూపిస్తామంటూ కామెంట్లు పెడుతున్నారు. ఎందుకు ఇంత వెట‌కారం? నీ ఫ్రెండే క‌దా? అని ప్ర‌శ్నిస్తున్నారు. ఇందుకు సిద్దార్ధ్ రిప్లే ఇస్తూ అందుకే భ‌య్యా..ఫ్రెండుకాబ‌ట్టే..ఫ్రీడం తీసుకున్నా..ఈకామెంట్ పై డార్లింగ్ ప్ర‌భాస్ కూడా న‌వ్వుతున్నాడు. ప్ర‌తి దానికి టెన్ష‌న్ ప‌డితే ఎలా టైట్ తీసుకొండి అంటూ సిద్దార్ధ్ ట్వీట్ చేశాడు.