ముదురు భామల క్రేజ్ మామూలుగా లేదు

35
- Advertisement -

41 ఏళ్ల వయసులో కూడా సీనియర్ హీరోయిన్ రోల్స్ తో శ్రియా శరణ్ బిజీ బిజీగా ఉంది. అదీ కూడా ఇద్దరు పెద్ద హీరోలతో సినిమాలు చేస్తోంది. శ్రియా శరణ్ ప్రస్తుతం కన్నడలో శివరాజ్ కుమార్ సినిమాలో నటిస్తోంది. ఇప్పుడు మరో తమిళ స్టార్ సినిమాలో కూడా ఛాన్స్ కొట్టేసింది. హీరో అజిత్ ప్రస్తుతం చేస్తున్న సినిమాలో శ్రియా శరణ్ కనిపించబోతుంది. ఆల్ రెడీ ఈ సినిమా షూటింగ్ ఈ రోజు అజర్ బైజాన్ లో ప్రారంభం అయింది. కాకపోతే శ్రియా శరణ్ వచ్చే వారం నుంచి షూట్ లో జాయిన్ కానుందని టాక్.

అన్నట్టు హీరోయిన్ త్రిష.. ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్. శ్రియా శరణ్ సెకండ్ లీడ్ గా నటిస్తోంది. త్రిష ఈ సినిమా షూటింగ్ కి సంబంధించి అప్ డేట్ పెడుతూ.. “వెకేషన్ కి వెళ్లాల్సిన అవసరం లేని ఉద్యోగం పొందండి. నేను అదే చేస్తున్నా,” అంటూ ఒక పోస్ట్ పెట్టింది. షూటింగ్ ల కోసమని హీరోలు, హీరోయిన్లు రకరకాల దేశాలకు వెళ్తుంటారు. దేశవిదేశాల చుట్టి వస్తారు పైసా ఖర్చు లేకుండా. మొత్తానికి ఎంజాయ్ కి ఎంజాయ్, రెమ్యునరేషన్లకి రెమ్యునరేషన్. బహుశా దీన్ని దృష్టిలో పెట్టుకునే త్రిష పైకామెంట్స్ చేసి ఉంటుంది.

అసలు నలభైలో ఉన్న త్రిష, శ్రియా శరణ్, నయనతార, అనుష్క్జ్ శెట్టి లాంటి భామలకు ఇంకా బాక్సాఫీస్ దగ్గర గిరాకీ ఉండటం విశేషం. ముఖ్యంగా త్రిష – నయనతార క్రేజ్ మామూలుగా లేదు. ఇప్పటికే త్రిష, విజయ్ సరసన “లియో” అనే సినిమాలో నటించింది. ఈ సినిమా ఈ నెల 19న రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా రిలీజ్ కాకముందే.. మరో స్టార్ హీరో అజిత్ సినిమాలో కూడా త్రిష మెయిన్ హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేయడం విశేషం. ఇక లేడీ సూపర్ స్టార్ నయనతార గురించి ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏముంది.

Also Read:రజనీతో అమితాబ్ – కమల్!

- Advertisement -