పెళ్లిపై త్రిష షాకింగ్ కామెంట్స్‌

67
Trisha
- Advertisement -

అందం,అభినయం రెండు కలబోసిన సౌందర్య శిల్పం త్రిష. తన అందాల వర్షంలో ప్రేక్షకులని తడిపి ముద్దచేసిన మనోహరి. మోడలింగ్ రంగం నుంచి వెండితెరపై తళుక్కుమన్న ఈ చెన్నై బ్యూటీ తెలుగు,తమిళ్‌ ఇండస్ట్రీలో అగ్రహీరోల సరసన నటించి మెప్పించింది. అయితే కొద్దికాలంగా వెండితెరకు దూరమైన త్రిష ఇటీవలె ఓటీటీ సిరీస్ తో పాటు పొన్నియన్ సెల్వన్ చిత్రంలో నటించి మెప్పించింది.

గతంలో వ్యాపారవేత్త వరుణ్‌ మనియాన్‌తో నిశ్చితార్థం చేసుకుని చివరికి కొన్ని కారణాల వల్ల పెళ్లిని క్యాన్సిల్ చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా పెళ్లిపై స్పందించింది త్రిష. పెళ్లి ఎప్పుడు చేసుకుంటానో తనకు తెలియదని కానీ మనసుకు నచ్చిన వాడు దొరికితే కచ్చితంగా చేసుకుంటానని తెలిపింది.

తనను పెళ్లి చేసుకునే వ్యక్తికి తనపై పూర్తి నమ్మకం ఉండాలని, అతను తన జీవితాంతం తనకు తోడుగా ఉంటాడని అనిపించాలని చెప్పింది. పెళ్లి చేసుకున్న తర్వాత విడాకులు తీసుకోవడం తనకు నచ్చదని తెలిపింది. దీంతో త్వరలోనే ఈ అమ్మడు గుడ్ న్యూస్ చెప్పనుందని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.

- Advertisement -