హ్యాపీ బర్త్ డే..త్రిష

74
- Advertisement -

అందం,అభినయం రెండు కలబోసిన సౌందర్య శిల్పం త్రిష. తన అందాల వర్షంలో ప్రేక్షకులని తడిపి ముద్దచేసిన మనోహరి. మోడలింగ్ రంగం నుంచి వెండితెరపై తళుక్కుమన్న ఈ చెన్నై బ్యూటీ తెలుగు,తమిళ్‌ ఇండస్ట్రీలో అగ్రహీరోల సరసన నటించి మెప్పించింది. మిస్‌ చెన్నైగా,మిస్‌ ఇండియా పోటీల్లో మిస్‌ స్మైల్‌గా ఎంపికైన ఈ బ్యూటీ పుట్టినరోజు నేడు. ఆమె పుట్టినరోజు సందర్భంగా గ్రేట్ తెలంగాణ.కామ్ ప్రత్యేక కథనం.

1983 లో మే 4 న చెన్నైలో జన్మించింది త్రిష.నీ మనసు నాకు తెలుసు..సిని ప్రస్తానాన్ని ప్రారంభించి.. నువ్వొస్తానంటే నేనొద్దంటానా..అంటూ తెలుగింటి ఆడపిల్లలా కుటుంబ ప్రేక్షకులకు దగ్గరైంది .ప్రభాస్‌తో వర్షం సినిమాలో నటించిన తన అందాలతో ప్రేక్షకుల్ని గిలిగింతలు పెట్టింది.ఈ సినిమా సూపర్‌ హిట్‌ త్రిషకు వరుస అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి.

సినీ ఇండస్ట్రీలో హీరోలతో సమానంగా గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్‌గా క్రేజ్‌ని సొంతం చేసుకుంది. తెలుగులో చిరంజీవి,మహేష్ బాబు,బాలకృష్ణ,వెంకటేష్,నాగార్జున,ఎన్టీఆర్,రవితేజ,పవన్ కల్యాణ్ వంటి అగ్రహీరోలతో నటించింది. తమిళ్‌లో అజిత్,విజయ్,విక్రమ్,సూర్య,శింబు,విశాల్‌తో పాటు కమల్‌ హాసన్‌ వంటి సీనియర్లతో జోడి కట్టింది.

Also Read:ఢిల్లీలో BRS ఆఫీస్ ప్రారంభం..

తెలుగులో ‘వర్షం’ , ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ , ‘అతడు’ , ‘పౌర్ణమి’ సూపర్ హిట్ సినిమాల్లో నటించింది త్రిష. తెలుగులోనే కాక త్రిష తమిళంలోనూ అగ్ర హీరోయిన్ గా రాణించింది. ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకపోయినా టాప్‌ పొజిషన్‌కు చేరుకుంది. పలు లేడి ఒరియెంటేడ్ సినిమాల్లో సైతం నటించి మెప్పించింది. ట్రెండ్‌కి తగినట్లు నడుచుకోవడంలో త్రిష తర్వాతే ఎవరైనా. హిట్టు,ఫ్లాపులతో సంబంధం లేకుండా స్టార్ స్టేటస్‌ను అందుకున్న క్రెడిట్‌ కూడా ఆమె సొంతం.

కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉన్నప్పుడే త్రిష పెళ్ళి పీటలెక్కేందుకు రెడీ అయింది. బిజినెస్‌ మెన్‌ వరుణ్ మణియన్‌తో 2015 జనవరి 23న త్రిషకి ఎంగేజ్‌మెంట్ జరిగింది. కానీ వీరిద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో ఆ రిలేషన్‌ బ్రేకప్ అయింది. ప్రస్తుతం కెరీర్‌పై దృష్టిసారించిన త్రిష..ప్రేక్షకులను మరింతగా అలరించాలని కొరుకుంటూ greattelangaana.com మరోసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తోంది.

Also Read:IMD:ముంచుకొస్తున్న మోచా..తీర ప్రాంతాలకు ఆలెర్ట్‌..!

- Advertisement -