త్రిష అస్సలు బెదరడంలేదట…

205
Trisha is back to work, starts work on `Garjanai`

క్రేజీ బ్యూటీ త్రిష లేటెస్ట్‌ మూవీ ‘గర్జనై’.  సుందర్‌ బాలు డైరెక్షన్‌ లో ఈ చిత్రం తెరకెక్కుతోంది. అయితే ఇప్పటికే ఈ సినిమాకి జల్లికట్టు ఉద్యమకారుల నుంచి అడ్డంకులు ఎదురయ్యాయి.

జల్లికట్టు నిషేధానికి కారణమైన ‘పెటా’ సంస్థలో త్రిష ప్రచారకర్తగా ఉన్నారంటూ ‘గర్జనై’ చిత్రీకరణ జరిగే ప్రాంతాల్లో జల్లికట్టు ఉద్యమకారులు ఆందోళనలు చేసి ఈ సినిమా షూటింగ్‌ను అడ్డుకున్నారు.ప్రస్తుతం జల్లికట్టు వ్యవహారం సమసిపోవడంతో ఇప్పుడు ఎలాంటి బ్రేక్‌ లు లేకుండా షూటింగ్‌ని కొనసాగిస్తున్నారు.
 Trisha is back to work, starts work on `Garjanai`
ఈ సినిమా షూటింగ్‌ తుది దశకు చేరుకుంది. అయితే  దర్శకుడు సుందర్‌ బాలు ‘గర్జనై’ గురించి మాట్లాడుతూ మహిళలపై జరుగుతున్న అకృత్యాలకు సంబంధించిన కథగా తెలిపారు. అయిదుగురు యువకులు ఒక బృందంగా ఏర్పడి యువతులను లైంగిక వేధింపులకు గురి చేస్తారని, ఆ దృశ్యాలను వీడియో కెమెరాల్లో బంధించి సామాజిక మాధ్యమాల్లో విక్రయిస్తుంటారని పేర్కొన్నారు. ప్రేమించడానికి నిరాకరించే యువతిని సామూహిక అత్యాచారం చేసి హత్య చేస్తారని తెలిపారు.
 Trisha is back to work, starts work on `Garjanai`
ఇదే నేపథ్యంతో సాగే యాక్షన్‌ థ్రిల్లర్‌ చిత్రమే ‘గర్జనై’గా పేర్కొన్నారు చిత్ర దర్శకుడు. యథార్థ ఘటనల ఆధారంగా రూపొందిన ఈ చిత్రంలో భిన్నమైన కోణంలో త్రిష నటించారని, యాక్షన్‌ సన్నివేశాలతో నిండిన ఈ చిత్రంలో ఏమాత్రం బెదరకుండా, డూప్‌ లేకుండా నటించారని తెలిపారు.

కథ విన్న వెంటనే నటించడానికి త్రిష ఒప్పేసుకుందని తెలిపారు. ఈ సినిమాకి అమ్రిష్‌ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇక సినిమాని సెంచురి ఇంటర్నేషనల్‌ ఫిలిమ్స్‌ సంస్థ పతాకంపై జేమ్స్‌ నిర్మిస్తున్నారు.