చిన్ననాటి ఫ్రెండ్స్ తో త్రిష పుల్‌ పార్టీ !

226
trisha-enjoyed-friendship-da
- Advertisement -

తెలుగులో అగ్రకథానాయికగా త్రిష ఎంతో క్రేజ్ తెచ్చుకుంది. అయితే ఇక్కడి కొత్త కథానాయికల పోటీని తట్టుకోలేక ఆమె కోలీవుడ్ పైనే దృష్టి పెట్టింది. అక్కడ సీనియర్ హీరోయిన్స్ లో నయనతార తరువాత స్థానంలో  త్రిష కొనసాగుతోంది. ప్రస్తుతం ఆమె చేతిలో ఉన్న 8 సినిమాలే అందుకు నిదర్శనం. అత‌డు, అల్ల‌రి బుల్లోడు, స్టాలిన్, బుజ్జిగాడు, కింగ్, చీక‌టి రాజ్యం, నాయ‌కి వంటి తెలుగు చిత్రాల‌తో టాలీవుడ్ లో సెన్సేష‌న్ క్రియేట్ చేసింది సౌత్ బ్యూటీ త్రిష.

trisha-enjoyed-friendship-da

మొదటి నుంచి కూడా త్రిష కి ఫ్రెండ్స్ సర్కిల్ ఎక్కువే. ఆమె స్నేహితుల్లో ఇటు ఇండస్ట్రీకి చెందిన వాళ్లు .. అటు బయటవాళ్లు కూడా వుంటారు. వాళ్లతో కలిసి సరదాగా గడిపే ఛాన్స్ ను త్రిష ఎంతమాత్రం వదులుకోదు. షూటింగ్ లేని సమయాల్లో వాళ్లందరినీ తీసుకొని ఎక్కడో ఒక చోటుకి విహార యాత్రను ప్లాన్ చేస్తుంటుంది.స్నేహితుల రోజు సందర్భంగా నిన్నంతా ఫుల్ గా ఎంజాయ్ చేసింది త్రిష. ఆదివారం కావడంతో షూటింగ్స్ లేవు. సో.. పొద్దున లేచిన వెంటనే ఓ సెక్షన్ ఫ్రెండ్స్ ను లంచ్ కు ఆహ్వానించింది. వాళ్లతో జాలీగా గడిపింది.

ఇక సాయంత్రం అవ్వగానే, మరికొంత మంది ఫ్రెండ్స్ తో తన ఫేవరెట్ పబ్ కు చేరిపోయింది. వాళ్లతో నిన్న రాత్రంతా ఫుల్ గా ఎంజాయ్ చేసింది. ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేసిన కొన్ని ఫొటోల్ని సోషల్ మీడియాలో కూడా షేర్ చేసింది త్రిష. ‘బెస్ట్ ఫుడ్ .. బెస్ట్ ఫ్రెండ్స్’ అంటూ ట్వీట్ కూడా చేసేసింది.

- Advertisement -