కాజల్ షార్ట్‌ ఫిలిం చేసిందట‌..!

375
Kajal Aggarwal teams up with Ayushmann Khurrana
- Advertisement -

అందాల కాజల్ అగర్వాల్ తాజాగా ఓ షార్ట్ ఫిలింలో నటించింది. తెలుగు, తమిళ భాషల్లో బిజీగా వున్నప్పటికీ, బాలీవుడ్ నుంచి వచ్చిన ఈ ఆఫర్ ను అమ్మడు వదులుకోలేకపోయిందట. ‘ఖూన్ మై హై’ పేరిట రూపొందుతున్న ఈ లఘు చిత్రంలో కాజల్ కథానాయికగా నటించగా, బాలీవుడ్ హీరో ఆయుష్మాన్ ఖురానా సోదరుడు అపర శక్తి హీరోగా నటించాడు.అయితే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే.. నటుడు రాజకీయ నాయకుడైన శత్రుఘన్ సిన్హా కొడుకు.. హీరోయిన్ సోనాక్షి సిన్హా తమ్ముడు.. కుష్ సిన్హా ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు.

Kajal Aggarwal teams up with Ayushmann Khurrana

ఈ సినిమా గురించి కుష్ సిన్హా మాట్లాడుతూ “ ఈ షార్ట్ ఫిలిం ఒక డిల్లీ అబ్బాయి కి ఒక డిల్లీ అమ్మాయి మధ్య జరిగిన కథ. ఈ ఫిలింలో డిల్లీ హింది యస ముంబాయి ప్రేక్షకులుకు కొంచం కొత్తగా అనిపించవచ్చు. నేను అది కావలినే చేశాను. ఒక అమ్మాయి వాళ్ళ అమ్మ నాన్న ఫిక్స్ చేసిన ఒక అబ్బాయిని కలవమని చెబుతారు ఒక ముంబాయి రెస్టారెంట్లో . అలాంటి ఒక పరిస్థితి లో ఆ అమ్మాయి ఎలా ఆలోచిస్తుంది ఏమి జరిగింది అనేది కథ. ఈ ఫిల్మ్ ని మేము విరామం లేకుండా 18 గంటలు షూట్ చేసి పూర్తి చేశాము అని చెప్పాడు.

ఈ షార్ట్ ఫిలింలో డిల్లీ అమ్మాయిగా కాజల్ అగర్వాల్ పూర్తిగా న్యాయం చేసింది. కాజల్ ముంబయ్ అమ్మాయి అయినప్పటికీ.. డిల్లీ అమ్మాయిగా ఆకట్టుకుంది. కుష్ సిన్హా ఈ వెబ్ ఫిలింతో డైరెక్టర్ గా మారాడు. ఇంకా ఇలాంటి వెబ్ సిరీస్ లును మరింత సీరియస్ గా తీసే ఉద్దేశ్యం ఉంది అని కూడా చెబుతున్నాడు.

- Advertisement -