టాలీవుడ్ లో ఉన్న హీరోయిన్ల కంటే..త్రిష సమ్‌థింగ్ స్పెషల్. తనదైన గ్లామర్ తో, నటనతో ప్రేక్షకులను అట్రాక్ట్ చేస్తుంది ఈ చెన్నై సుందరి. అయితే ఈ అమ్మడు దశాబ్ధం పైగానే సౌత్ ఇండస్ట్రీస్‌ని ఏలుతోంది. త్రిష కెరీర్లో టాలీవుడ్ స్పెషల్ అనే చెప్పాలి. ఇక్కడే తన కెరీర్‌కి అతిపెద్ద బ్రేక్ వచ్చింది. ‘వర్షం’, ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ లాంటి బ్లాక్‌బస్టర్ హిట్లు కెరీర్‌కి దక్కాయి.
ఆ తర్వాత తమిళంలోనూ కెరీర్‌ని పెద్ద రేంజుకి తీసుకెళ్లగలిగింది. అయితే త్రిషకు ఇటీవలి కాలంలో తెలుగులో అవకాశాలు తగ్గాయి. దానికి కారణం లేకపోలేదు. ఈ అమ్మడు తెలుగు కంటే తమిళంకే ఎక్కువ ప్రాధాన్యతనిస్తోంది. అయితే మరోసారి తెలుగులోనూ మరిన్ని సినిమాల్లో నటించేందకు ప్లాన్ చేస్తోందట. మన దర్శకనిర్మాతలతోనూ టచ్‌లో ఉందని సమాచారం. మరోసారి మనోళ్లను ఆకట్టుకునేందుకు ప్రత్యేకించి మేనిశిరుల్లో మెరుపులు రంగరిస్తోందని తెలుస్తోంది.
దశాబ్ధం కెరీర్ తర్వాత కూడా అందచందాల్ని కాపాడుకోవడం అంటే అంత వీజీ కాదు. కానీ త్రిష ఇప్పటికీ అవే మెరుపులతో మైమరిపిస్తోంది. అందుకోసం నిరంతరాయంగా వ్యాయామం చేస్తూ, ఆహారనిమయాలు పాటిస్తోందట. అందుకోసం తల్లి ఉమాకృష్ణన్ సైతం ఎంతో సహకారిగా ఉంటున్నారట. త్రిష డైట్‌ను ప్రత్యేకించి డిజైన్ చేశారట. అందుకే ఇప్పటికీ తిరుగులేని రూపలావణ్యంతో ఈ అమ్మడు కవ్విస్తోందని చెబుతున్నారు.
త్రిష ప్రస్తుతం తమిళంలో మోహిని, సతురంగ వెట్టై, గర్జనై చిత్రాల్లో నాయికగా నటిస్తోంది. ఇక త్రిష ఏ వేడుకలకు వెళ్లినా అక్కడ తన అందచందాల గురించి తంబీలు ముచ్చటించుకుంటున్నారంటే అందుకు తాను తీసుకుంటున్న జాగ్రత్తలే కారణమని చెప్పుకుంటున్నారు.