సందీప్‌ కిషన్‌ ‘మాయావన్‌’

119
Sundeep Kishan Mayavan Movie

సందీప్‌ కిషన్‌, లావణ్య త్రిపాటి, జాకీష్రాఫ్‌ ప్రధాన పాత్రల్లో సి.వి. కుమార్‌ దర్శకత్వంలో తమిళ్‌లో తెరకెక్కిన ‘మాయావన్‌’ చిత్రాన్ని ఎస్‌బికె ఫిలింస్‌ కార్పోరేషన్‌లో నిర్మాత ఎస్‌.కె. బషీద్‌ తెలుగు ప్రేక్షకులకు అందించనున్నారు. ఈ సందర్భంగా ఎస్‌.కె.బషీద్‌ మాట్లాడుతూ..’ఆద్యంతం ఆసక్తి కలిగించే ఉత్కంఠతతో తెరకెక్కిన తమిళ ‘మాయావన్‌’ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. సందీప్‌కిషన్‌, లావణ్య త్రిపాటి, జాకీష్రాప్‌లు ఇందులో కీలకమైన పాత్రల్లో నటించారు. ప్రస్తుతం ఓ సాంగ్‌కి సంబంధించి చిన్న ఫ్యాచ్‌ వర్క్‌ జరుగుతోంది. ఇది ఏప్రిల్‌ 27 వరకు కోడైకెనాల్‌, చెన్నయ్‌లలో జరుగుతుంది. ఆ వెనువెంటనే ఆడియోని రిలీజ్‌ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాము. ఈ సినిమాకి సంబంధించి తెలుగు టైటిల్‌ను, ఇతరత్రా విషయాలను అతి త్వరలో తెలియజేస్తాము..’ అని అన్నారు.

Sundeep Kishan Mayavan Movie