ధనుష్‌ ద్విపాత్రాభినయంతో ‘ధర్మయోగి’

261
- Advertisement -

‘రఘువరన్‌ బి.టెక్‌’ చిత్రంతో తెలుగులోనూ మంచి ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ సంపాదించుకున్న హీరో ధనుష్‌ తాజాగా ‘రైల్‌’ చిత్రంతో ఓ డిఫరెంట్‌ ఎక్స్‌పీరియన్స్‌ని ఇచ్చారు. ఈ దీపావళికి మరో డిఫరెంట్‌ మూవీతో ధనుష్‌ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఆర్‌.ఎస్‌.దురై సెంథిల్‌కుమార్‌ దర్శకత్వంలో తమిళ్‌లో రూపొందిన ‘కొడి’ చిత్రంలో తొలిసారి ధనుష్‌ ద్విపాత్రాభినయం చేశారు. ఈ చిత్రం ‘ధర్మయోగి'(ది లీడర్‌) పేరుతో తెలుగులో విడుదల కానుంది. శ్రీమతి జగన్మోహిని సమర్పణలో విఘ్నేశ్వర ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై యువ నిర్మాత సి.హెచ్‌.సతీష్‌కుమార్‌ ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తున్నారు.

DHARMA YOGI

ఈ సందర్భంగా నిర్మాత సి.హెచ్‌.సతీష్‌కుమార్‌ మాట్లాడుతూ – ”ధనుష్‌ తొలిసారి ద్విపాత్రాభినయం చేసిన ‘కొడి’ చిత్రంపై చాలా హై ఎక్స్‌పెక్టేషన్స్‌ వున్నాయి. తెలుగులో ధనుష్‌కి వున్న ఫాలోయింగ్‌ అందరికీ తెలిసిందే. ఈ చిత్రాన్ని తెలుగులో ‘ధర్మయోగి’ పేరుతో విడుదల చేస్తున్నాం. ఈ చిత్రంలో ధనుష్‌ చేసిన రెండు క్యారెక్టర్స్‌ పూర్తి విభిన్నంగా వుంటాయి. ఈ చిత్రంలో త్రిష, అనుపమ పరమేశ్వరన్‌ హీరోయిన్లుగా నటిస్తుండగా, తమిళ్‌ స్టార్‌ హీరో విజయ్‌ తండ్రి ఎస్‌.ఎ.చంద్రశేఖర్‌ ఓ ప్రత్యేక పాత్రను చేయడం విశేషం. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌లో భాగంగా పాటల రికార్డింగ్‌, డబ్బింగ్‌ కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన మోషన్‌ పోస్టర్‌ను రిలీజ్‌ చెయ్యబోతున్నాం. సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ ‘కబాలి’ చిత్రానికి సంగీతాన్ని అందించిన సంతోష్‌ నారాయణన్‌ ఈ చిత్రానికి అద్భుతమైన పాటలు చేశారు.

ఈ చిత్రం ఆడియోను అక్టోబర్‌ రెండో వారంలో చాలా గ్రాండ్‌గా రిలీజ్‌ చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నాం. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి దీపావళి కానుకగా విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ చిత్రం పెద్ద హిట్‌ అయి మా విఘ్నేశ్వర ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బేనర్‌కి మంచి పేరు తెస్తుందని ఆశిస్తున్నాను” అన్నారు.

DHARMA YOGI

ధనుష్‌ ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ చిత్రంలో త్రిష, అనుపమ పరమేశ్వరన్‌ హీరోయిన్లుగా నటిస్తుండగా ఎస్‌.ఎ.చంద్రశేఖర్‌ ఓ ప్రత్యేక పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రానికి మాటలు: శశాంక్‌ వెన్నెలకంటి, పాటలు: రామజోగయ్యశాస్త్రి, సినిమాటోగ్రఫీ: వెంకటేష్‌ ఎస్‌., ఎడిటింగ్‌: ప్రకాష్‌ మబ్బు, సంగీతం: సంతోష్‌ నారాయణన్‌, సమర్పణ: శ్రీమతి జగన్మోహిని, నిర్మాత: సి.హెచ్‌.సతీష్‌కుమార్‌, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఆర్‌.ఎస్‌.దురై సెంథిల్‌కుమార్‌.

DHARMA YOGI

- Advertisement -