ఫ్యాన్స్ కోసం చిరు 150లో మార్పు..!

232
- Advertisement -

మెగాస్టార్ ఇమేజ్ అంత ఆశామాషీ కాదు. అభిమానులు ఆస్థాయిని తగ్గి ఏ పాత్ర చేసిన ఒప్పుకోలేరు. అందుకే చిరు ఎప్పుడు అభిమానులను దృష్టిలో పెట్టుకుని సినిమాలు చేస్తుంటాడు. అయితే కత్తి రీమేక్ రూపంలో చిరుకు పెద్ద సమస్య వచ్చిపడింది. ఈ మూవీలో రైతు సమస్యలపై పోరాడుతూ ఉండే హీరోను పోలీసులు అరెస్ట్‌ చేస్తారు. ఆ సమయంలో లాకప్‌లో ఉన్న హీరో అండర్‌వేర్‌తో కనబడతాడు.

స్టార్‌ స్టేటస్‌ ఉన్న హీరో విజయ్‌ ఈ సీన్‌లో అండర్‌వేర్‌తోనే కనబడడానికి వెనుకాడలేదు. సహజత్వం కోసం అలా చేసి అందరి ప్రశంసలూ అందుకున్నాడు. అయితే మెగాస్టార్ మాత్రం ఈ సీన్ చేయడమా? వద్దా అన్నదానిపై తర్జనభర్జనలు పడుతున్నాడట. అటు వినాయక్ కూడా మెగాస్టార్ చిరంజీవి ఈ సీన్‌లో నటిస్తే ఫ్యాన్స్ ఎలా రిసీవ్‌ చేసుకుంటారోనని తెగ ఇదైపోతున్నాడట. మరీ, చిరు అండర్ వేర్ లో కనిపిస్తాడా? లేక ఫ్యాన్స్ కోసం కథే మార్పించేందుకు సిద్ధమవుతాడా తెలియాలంటే సినిమా రిలీజ్ వరకు ఆగాల్సిందే.

- Advertisement -