అందం,అభినయం రెండు కలబోసిన సౌందర్య శిల్పం త్రిష. తన అందాల వర్షంలో ప్రేక్షకులని తడిపి ముద్దచేసిన మనోహరి. మోడలింగ్ రంగం నుంచి వెండితెరపై తళుక్కుమన్న ఈ చెన్నై బ్యూటీ తెలుగు,తమిళ్ ఇండస్ట్రీలో అగ్రహీరోల సరసన నటించి మెప్పించింది. మిస్ చెన్నైగా,మిస్ ఇండియా పోటీల్లో మిస్ స్మైల్‌గా ఎంపికైన త్రిష నాలుగు పదుల వయస్సు దాటినా ఇంకా పెళ్లి చేసుకోకుండా సింగిల్‌గానే ఉంది.
పలుమార్లు త్రిష పెళ్లిపై వార్తలు వచ్చినా వాటిని ఖండిస్తూ వచ్చింది. తాజాగా తన పెళ్లి గురించి మాట్లాడిన త్రిష.. తనకు పెళ్లి మీద పెద్దగా నమ్మకం లేదు. అందుకే దానికి దూరంగా ఉంటున్నాను. నాకు పెళ్లి కావట్లేదనే బాధ అస్సలు లేదు అని చెప్పుకొచ్చింది.
ప్రస్తుతం తాను తన కెరీర్, సినిమాలు, ఫ్యామిలీ మీదనే దృష్టి పెడుతున్నాను. ఒకవేళ నాకు పెళ్లి కావాలని ఉండి అది జరిగితే ఓకే. ఒకవేళ కాకపోయినా ఓకే. నేను దాని గురించి ఎన్నడూ ఆలోచించలేదు అని తెలిపింది. బహుషా పెళ్లి, పిల్లలు నాకు వర్కౌట్ కావేమో అనిపిస్తుంది అని కామెంట్ చేసింది.
Also Read:గ్రేటర్‌లో 3 రోజులు వైన్స్ బంద్

